నా హైదరాబాదీయం

మావాడు ముందు నన్ను ఈనాడు డైలి ఆఫీసు కి తీసి కెళ్లాడని చెప్పాను కదా.అక్కడ ఏదో ఇంగ్లీషు వ్యాసాన్ని చ్చిదాన్ని తెలుగులో అనువదించమన్నారు.నేను స్కూల్లో లా మక్కీకిమక్కి అనువదించేను.తర్వాత ఏమైందో నాకేం చెప్పలేదు. మావాడు వాళ్ళ తో ఏదో మాట్లాడే క నా దగ్గరికి వచ్చి పదపద అన్నాడు. ముగ్గురం (నేను,శర్మా,మావాడు) ఇంటికి వచ్చేం.నాకు ఆత్రుతగా సంగతి తెలుసు కోవాలనివుంది.
ఆ సాయంత్రం ముగ్గురం ఆటోలో పెరేడ్ గ్రౌండ్‌ చేరుకున్నాం.నగరమంతా విద్యుద్దీపాల్తో కళ కళ్లాడుతోంది.చిన్న పట్నం నించీ వచ్చిన నాకు అంతపెద్ద నగరం జనలతో వాహనాల తో జనారణ్యం లా భయంగొలిపే సౌందర్య దేవత లా కనిపించింది. ఆ గ్రౌండ్స్‌లో ఓచోట మేం ముగ్గురం కూచున్నాం.
మావాడు గిరీశం లా నావేపు తిరిగి “ఏరా ఎప్పుడైనా బీరు తాగేవా”అనడిగాడు. నిజానికి నేనెప్పుడువాటి జోలికిపోలేదు.అయినా సహజచాపల్యంతోకొంత వాళ్లు నన్ను బబ్రాజమానంగాడ్లా జమ కట్టకుండా బుర్రవూపేను.అలా అక్కడే బిస్మిల్లా అయింది.
ఆ మర్నాడు నన్ను మేగజైన్ సెక్షన్ ఇంఛార్జి చలసాని గారి దగ్గరకు తీసికెళ్లారు.ఆయనకి వినికిడి సమస్య. ఆయన మాటడితే ఎదటి వాళ్ళు అక్కడే సిద్ధంగా వున్న పేడ్ మీద జవాబు రాయాలి.అక్కడకూడా ఓ రెండు మూడు అనువాదాలు చేసేను.ఎలాగో గండంగడిచి పిండం బయటపడింది అన్నచందంగా అతని పర్యవేక్షణ లో వున్న చతుర మాసపత్రిక సబ్ ఎడిటర్‌ గ తీసుకున్నారు.అప్పటి కే శర్మ విపుల చూస్తుండేవాడు.
మొదట్నించీ బయటే చదువు ల నెపంతో వుండి పోవడంవల్ల నాక్కొంచెం హోంసిక్నెస్ ఎక్కువ. అస్తమానూ అమ్మా నాన్న ఖరగపూర్ గుర్తొస్తూండేవి.ఇక్కడ మావాడి ఇరుకు యింట్లో రెండేగదులు ఓవరండా. వీధరుగు మీద పడుకున్నా పడుకోనివ్వని దోమలు.ఆప్రేమ్నగర్ గలీ లో దోమలేగానిప్రేమల్లేవు.కొత్త లో నేనుకూడ మావాడితోపాటు వాళ్ళ ముందు గదిలో ఇద్దరు పిల్లలు తోపడుకునేవాణ్ని.ఓవారం గడిచాక నాపక్క పెరటి వరండా లో శర్మ పక్కనే చేరిపోయింది.
శర్మ తనదైనశైలి లో చాలా విషయాలు, పార్వతీ పురం విశేషాలు నాతో ముచ్చటించేడు.
మేమిద్దరం కలసి ఎన్నో జాగాలు తిరిగేవాళ్లం.అలాంటప్పుడు ఒకసారిఏజి ఆఫీసు రంజని మాయిద్దరి అభిమాన రచయిత లు రావిశాస్త్రి కాళీపట్నం వస్తు న్నారని తెలిసి హాజరయ్యాం.
ఆఫీసు లో ఆర్టిస్టు లైన పెమ్మరాజు రవికిషోర్,ప్రభాకర్, మేటిఈనాటి శ్రీ ధర్,శివప్రసాద్ రమణజీవి అందరూ మాపట్ల అభిమానంగా వుండే వారు. జీతం మాత్రం సరిపోయేదికాదు.
ఈలోగ శర్మ హఠాత్తుగా పెళ్ళి చేసుకుని వేరేకాపురం పెట్టడంతో నేనొక్కణ్నే అయి పోయాను.నేనుకూడా మావాడి దగ్గర్నుంచి మకాం మార్చి పిల్లిలా రెండుమూడిళ్లు చూసేను.
కానీ యీ లోగా మానాన్నగారు అర్జెంటుగా రమ్మని రైల్వే లో వుద్యోగ ప్రయత్నాలు జరుగుతూ న్నయని చెప్పడం తోతట్టాబుట్టా సర్దేసి చలసాని వారికి నిజం చెప్పే సి ఈస్టు కోస్ట్ రైలు ఎక్కేసాను.
ముగింపు మరోసారి

Comments