మాయాజాలం

మాయాజాలం..అంతర్జాలం
అరె..
ఏమైంది?
ఓ గాడ్
ఛత్
విసుక్కుంటూ ఇంట్లో సభ్యులు ఒకరి తర్వాత ఒకరు
కలుగులో ఎలుకల మాదిరి బయటకు రాసాగేరు.
డైనింగ్ టేబుల్ దగ్గర తాత,పదేళ్ళ మనవడు కూర్చుని వస్తున్న వారిని ముసిముసి నవ్వులతో చూస్తున్నారు.
"షిట్.వేళాపాళ లేదు.
ఎప్పుడు పడితే అప్పుడు
కరెంటు తీసేయటమే."
నాన్న చిరాకు.
"నా ప్రాజెక్ట్ పని  ఆగిపోయింది మధ్యలో" విసుగ్గా పెద్దబ్బాయి
"వాట్ డాడీ .దిసిజ్ టూమచ్"
గారాల కూతురు.
"మిసెస్ సాన్యాల్ తో విడియో చాట్ ఎబ్రప్డ్గా బ్రేక్ అయింది.
షాపింగ్ డిటెయిల్స్ పూర్తి కాకుండా.."
ఇంటావిడ ఆక్రోశం.
అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర సర్దుకుని కూర్చున్న తరువాత, తాతగారు నోరు విప్పేరు.
"నిన్న పదేళ్ళ పసివాడు మొబైల్ లొ గేమ్ ఆడుతున్న ప్పుడు మీరంతా యధాశక్తి వాడ్ని నానా చీవాట్లు పెట్టారు.
నేనేమీ అనలేదు.
ఎందుకంటే వాడప్పుడు చేసింది తప్పు కాబట్టి.
చదువు కునే సమయంలో చదువుకోవాలి..ఆడుకునే టప్పుడు ఆడుకోవాలి.
అలాగే అన్నిటికీ నిర్దిష్ట సమయాలున్నాయి.
లంచ్ సమయానికి లంచ్ తీసుకుని తీరాలి.
నాబోటి వాళ్ళు, చిన్నపిల్లలు ఆకలిని తట్టుకోవడం కష్టం.
మీరు మీమీ మొబైల్, లాప్టాపుల్లో దూరిపోయి ,ఏవిషయాన్ని పట్టించుకోకుండా గడిపేస్తే ఎలా?
అందుకే, మిమ్మల్ని మీ లోకాల్నుంచి బయటకు రప్పించడానికి నేనే ఆ వైఫై స్విచ్ ఆఫ్ చేసేను.
ఆధునిక తని మనకనుకూలంగా మార్చుకుని జీవించడంలో ఆనందముంది గానీ మనకి అది అడ్డంకిగా మార్చుకోకూడదు.
ఒకరికి చెప్పేముందు మనం ముందు మారి అప్పుడు వాళ్ళ కి చెప్తే ప్రయోజనం వుంటుంది."
అందరూ తలలు మరింత దించుకుని నిశ్సబ్దంగా తినసాగేరు.
తాత,మనవడు వాళ్ళ మొహాల వంక చూసి తమలొ
తామే నవ్వుకున్నారు

Comments