చంపాలని వుంది

అపరాధ పరిశోధన..
అనగానే ముందు గుర్తు కొచ్చే పేరు
షెర్లాక్ హోమ్స్..
అతని సునిశిత పరిశీలన. అర్దం కాని దర్యాప్తు.. చివరికి నేరస్తుల ను యుక్తి గా
పట్టుకునే నేర్పు పాఠకులను సంభ్రమాశ్చార్యాలకు  గురి చేస్తాయి.
అర్దం కాని వివరాలు తన అసిస్టెంటు వాట్సన్ కి వివరించడ మంటే పరోక్షంగా మనకి అంటే పాఠకులకు చెప్పడమన్నమాట.

ఒక విధంగా వాట్సన్ పాత్ర పాఠకుల ప్రతిరూప మనవచ్చు.
హోమ్స్ పరిశోధన కు అబ్బురపడ్డ పాఠకులు
నిజంగా అతని చిరునామా 221B,బేకర్ స్ట్రీట్ లో వున్నట్లు భావిస్తారు.
ఇహపోతే హోమ్స సృష్టి కర్త సర్ ఆర్దర్ కానన్ డాయిల్ ఒకానొక సమయంలో అతని ప్రఖ్యాత పాత్ర ని అంతం చేసే రచన చేయగానే అభిమానులు విపరీతంగా స్పందించి, కోపం గా వుత్తరాలు రాసేరు.
అందుకు ప్రతిగా రచయిత -ది రిటర్న్ ఆఫ్ షెర్లాక్ హోమ్స్ అని మళ్ళీ తన పాత్ర ని బతికించ వలసి వచ్చింది.
ఆ తర్వాత కూడా చాలామంది డిటెక్టివ్ కధలు రాసారు.
తెలుగులో కూడా కొమ్మూరి సాంబశివరావు తదితరులు డిటెక్టివ్ కధలు రాసేరు.
ఇప్పుడు నేను అనువదించి న కధ కూడా కెన్ స్టెడ్ మన్ రాసిన ఆంగ్ల కధ.
ఇది చాలా కాలం కిందట విపుల మాస పత్రిక లో వచ్చింది.
ఇప్పుడు మీ కోసం.@@@

Comments