నా చేదు కధ

రోజాదివారం కదాన్చెప్పి
నా చిన్నప్పటి ప్రెండింటికి బయల్దేరాం .
రెండు బస్సులు వొక అటో దూరంలో వుంటాడు వాడు.
కేబ్ అయితే ఆరువందలు.
రానుపోనూ పన్నెండు వందలు..
ఎవడబ్బ సొమ్మని...
సరే బస్సు యాత్ర..ఆటో సవారి అయ్యాక వాడింటి లిఫ్ట్ పని చెయ్యకపోతే చచ్చినట్లు మెట్లన్నీ యెక్కి నాలుగో అంతస్తులో వున్న వాడి కొంపకి చేరుకున్నాం.
మామూలు పలకరింపులయ్యేక యింట్లో వున్న ఆల్బమ్ ల కట్ట తెచ్చి ఆ మధ్య పెళ్లయిన వాడి రెండో కూతురి పెళ్లి ఫోటోలు చూడమని మా యెదట పడేసాడు.
అందులో తొంభై శాతం నాకు తెలీని వాళ్లే.
ఈ లోగా వాడి మనవరాలు డాన్స్ ప్రొగ్రామ్ స్నాపులు వాళ్ల కోడలు మా ఆవిడకి రన్నింగ్ కామెంటరీ తో సహా లైవ్ డిమాన్స్రేషన్ యివ్వసాగింది.
మా స్పాండిలైటిస్ భుజాలు అప్పటికే బుర్ర అటుయిటు తిప్పడం వల్ల జవాబివ్వసాగేయి.
"అన్నట్టొరేయి..పదరా మనమందరం  సెల్ఫీ తీసుకుందాం"
అన్నాడు మా వాడు.
అదో అరగంట ప్రహసనం అయ్యాక వాళ్లిచ్చిన కాఫీ తాగి -
మా ఆవిడ వంక వెళ్దామా అన్నట్టు చూసేను.
అందుకోసమే యుగాల్తరబడి యెదురు చూస్తున్నట్లు తల వూగించిందావిడ.
సాయంత్రం వరకు వుందామనుకున్న వాళ్లం యేదో కుంటి సాకు చెప్పి బయటపడ్డాం.
నెమరు వేసుకుందామనుకున్న చిన్న నాటి జ్ఞాపకాలు భయంతో పారిపొయాయి.
అయ్యలారా!అమ్మలారా!
ఇంటి కెవరైనా వస్తే కాస్త వాళ్ల పరంగా ఆలోచించండి.
మన డబ్బా మనం కొట్టుకునే కన్నా వాళ్లు కొట్టే దాక ఆగండి.

Comments