ఉగాది పద్యాలు

ఉ.మా.శాపము రూపమున్ కనియె శార్వరి మానవ మృత్యు ఘోషలే
తాపము కీలలై చటుల తాండవ మాడెను భీకరమ్ముగా
పాపము పేద వారి కిల పస్తుల బాధలు తప్పకుండెనే
ఆపదఁ గావగా కదలె యార్తిగ నో ప్లవ వత్సరమ్మిటన్!

ఉ.మా.అన్నుల మిన్నలే యవని యంతయు ముగ్గుల రంగులద్దగన్
మిన్నుల వేల్పులే నిలచి మేదిని వేడుక దేరి చూడగన్
కన్నుల పండగే మనకు కాముని సందడి కళ్లముందరన్
సన్నుతి సేయగా ప్రభుని సాక్షిగ వృడెద సర్వసౌఖ్యమున్


కం.చీకటి నింపిన శార్వరి
కూకటి వేరును కరోన గూలన్ ద్రోయన్
తేకువ తోడను రావే
మాకును మేలునుకలుగగ మాతా నీవే!

Comments