రూపాకుల నాగలక్ష్మి గారి అభిప్రాయం

.కథలపేర్లు: ఉక్రోషం ఇంద్రనీలం, అడ్డంతిరిగిన కథ, లోయర్ బెర్త్
రచన:శ్రీ భాగవతుల కృష్ణారావు

చిన్న కథలు రాయటం కష్టం ఎందుకంటే తక్కువమాటలలో చెప్పదలచిన సందేశాన్ని అందించటానికి భాషను భావాన్ని చక్కగా అనుసంధానం చేయగలిగి ఉండాలి . విషయంలోస్పష్టతతో, వివరణలో ఆసక్తికరమై ఉండాలి .ముఖ్యంగాముగింపులో కొసమెరుపు వీనికి ప్రాణం .మపాసా, ఓ హెన్రీ, మల్లాది వెంకట కృష్ణమూర్తి ల కధలు చిన్నకథలకు చక్కని ఉదాహరణలు.

ఉక్రోషం లో జంతువులదృష్టిలో మన అలవాట్లు జీవనవిధానం ఎంత చికాకు కలిగిస్తాయో పిల్లి ద్వారా చెప్పించారు.
ఇంద్రనీలం కథలో  కుటుంబపు కీర్తిచిహ్నమైన ఇంద్రనీలమే ఆపెద్దామెను బలితీసుకోవటం చివరకు వారి వారసులకుకాక కాటికాపరి పాలు కావటం హృద్యంగా వర్ణించారు .
అడ్డంతిరిగిన కథలో 
హాస్పటల్ వాతావరణాన్ని చక్కగా వర్ణిస్తునే కొన్ని సమయాలలో మన అనుభవాలపై అంచనాలు ఎలా తప్పవుతాయో మతిమరపు ముసలాయనవిషయంలోచక్కగా చెప్పారు .
లోయర్ బెర్త్ కథలో రైలు ప్రయాణీకులలో తమ బెర్త్ గురించి ఎంత పట్టుదలగా ఎదుటివారి అశక్తతనుకూడ గుర్తించని అమానవీయతను అపహాస్యం చేస్తూ ఒకవికలాంగుడుతన అవసరమైన లోయర్ బెర్త్ మరొకరికి వదిలివేయటం వలన కథకుని వచ్చిన పరివర్తన చాలా చక్కగా చెప్పారు . నాలుగుకథలును అవసరమైనంత వర్ణన, కథాగమన వేగంతోను కొసమెరుపు కూడిన అనూహ్య ముగింపు తోనూ చిన్నకథలకు చక్కని ఉదాహరణలు గా నిలిపిన రచయిత  గారికి అనేక అభినందనలండీ .With Sri Krishna Rao. B.

Comments