పద్యప్రహేళిక

ఓం శ్రీ గురుభ్యోనమః

ప్రహేళికా బంధువులకు నమస్కారం.

తొలిసారిగా శ్రీ పరమేశ్వర కృపగారి అనుమతితో ఈ పద్యప్రహేళిక నివ్వడం జరిగింది.

పద్య ప్రేమికులంతా
 ఆహ్వానితులే.
నియమాలు మామూలే.

ఒకటే జవాబు.

శరములెన్నయినా చివరి శరమును మాత్రమే జవాబు గా పరిగణిస్తాను.

జవాబులు ఇక్కడ పెట్టరాదు.జవాబును సూచించే క్లూలను కూడా ఇవ్వరాదు.

మూడు వరకు సమయం.

కం.కొలువున కొట్టెను సత్యుడు
అలిగిన తాపసి వెడలగ యహమే పోగా
దెలుపరె వాహిని యాహ్వను
నిలుపగ బూర్వపు దళుకును నిశ్చయ రీతిన్!

చాలా తేలిక పద్యం. మహామహులు నిముషాల్లో జవాబు పంపిస్తారు.

Comments