మనీషి

"ఆటో"

దగ్గరగా ఆగిన ఆటోలోకి తొంగి చూసింది సునంద.

అరవై దాటిన వ్యక్తి.

"వేర్ వుడ్ యూ లైక్ టు గో మేడం"

అతని బాషకు అచ్చెరువంది ఎక్కడికి వెళ్లాలో చెప్పింది.

"ప్లీజ్ గెటిన్"
గబగబ సీట్లో సర్దుకుని కూర్చుంది సునంద.
అసలే ఆలస్య మయింది..ఇంకా లేటవుతే బాస్ దగ్గర అక్షింతలు తప్పవు.
ఆటో కదలగానే కుతూహలం తో అడిగింది.

అతడు చెప్పే వివరాలు వింటున్న సునంద కళ్లు ఆశ్చర్యం తో పెద్దవయ్యాయి.

అతడు ప్రయివేటు కాలేజీలో ఇంగ్లీషు లెక్చరర్‌గా పనిచేసి,అరవై రాగానే రిటైరయ్యాడట.

ప్రయివేట్ కాలేజ్ కావడం వల్ల పెన్షన్ లేదు.
ఉన్న వొక్క కొడుకు భార్యతో విడిగా ఉంటున్నాడు .పోతే తమకోసం ఒక అద్దె ఇల్లు తీసుకుని దాని అద్దె పన్నెండు వేలు మాత్రం ఠంచనుగా ఇల్లుగలాయనకు చెల్లిస్తాడట.
ఇంకా అతనిపై భారం మోపడం ఇష్టం లేక తను అద్దెకు ఆటో నడుపుతునాడట.
అద్దెపోగా రోజుకి వెయ్యి,పదిహేను వందల దాకా సంపాదిస్తాడట.

"సరిపోతుంది నాకు..నా గర్ల్ ఫ్రెండ్ కి" అని నవ్వి-

"గర్ల్ ఫ్రెండ్ ఎవరో కాదు..మా ఆవిడే..నా కెందుకో భార్య అంటే బానిస లా ధ్వనిస్తుంది. నాతో సమానురాలు,సహచరి కాబట్టి గర్ల్ ఫ్రెండ్ అన్నాను" అన్నాడు చిరునవ్వు తో.
సునందకు తన తండ్రి, అన్నయ్య గుర్తుకొచ్చారు.

(బొంబాయి లో జరిగిన యదార్థ సంఘటన చదివాక.)

Comments