కంటి తుడుపు

కంటితుడుపు
@@@@@@
చిన్నప్పటి నుంచీ నాకో సందేహం!
ఇంతమంది శాస్త్రజ్ఞులు ఎన్నెన్నో కనిపెడుతున్నారు గానీ చాలా అవసరమైన విషయం వదిలేసారనిపిస్తోంది..
ముఖ్యంగా నాలాంటి చతుర్నేత్రులు ఎదుర్కుంటున్న సమస్య...
వర్షాకాలం లో మిగిలిన ఉపద్రవాలు ఎలా వున్నా, బయటకి పనిమీద వెళ్తే అకస్మాత్తుగా జల్లు పడితే 
అంతే సంగతులు.
ఏ ద్విచక్ర వాహనం మీద ఉంటే మరీ సమస్య.
సూదుల్లాంటి వాన చినుకులు తలనీ,మొహాన్నీ తడిపేస్తూ,ధారకట్టిన నీరు కళ్లలోకి చేరి మంట పెడుతూ..కంటి అద్దాల‌మీద నీటి బిందువుల తెరతో ఎదుటి దృశ్యం కనపడక ..
ఆ బాధ వర్ణనాతీతం!
చచ్చినట్టు ఒక పక్కగా బండాపి, రుమాలు తీసి కళ్లనీ,కంటి జోడు అద్దాల్ని శుభ్రంగా తుడిస్తే తప్ప కదలలేము.
ఇంతకీ నా కొచ్చిన సందేహ మేమిటంటే-
కారుకు,బస్సు కు పెట్టినట్లు, కళ్లజోడుకి వైపర్స్ ఇంతవరకూ ఎందుకు కనుక్కోలేదో?

Comments