శ్యాలకులు

కింద ఫొటోలో ఉన్న వాళ్లు నక్సలైట్లు కాదండి...స్వయానా నా బావమరుదులు..మా మేనమామ కొడుకులు..

వీళ్ల తమ్ముళ్లు మరో ఇద్దరు కూడా ఉన్నారు.

పెద్దవాళ్ళి ద్దరూ నాలాగే రైల్వే లో పని చేసి నిక్షేపంగా రిటైర్ అయ్యాక విశాఖపట్నం లో స్థిరపడ్డారు.
ఇద్దరూ పనిమంతులే!

మా ఆవిడకి వీళ్లతో బాగా అటాచ్మెంటుంది.
వాళ్లతో తన చిన్ననాటి జ్ఞాపకాలు తరచూ చెప్తుంటుంది.
హాస్యంగా వాళ్లనో మాట కూడా అననివ్వదు.

'సారీ దునియా ఏక్ తరఫ్
జోరూకా భాయి ఏక్ తరఫ్'

అనుకుని నోర్మూసుకుంటాను.

తనని విసుక్కోకుండా సైకిల్ మీద ఊరంతా తిప్పడమే కాకుండా వాళ్లు పని మీద బయటి ఊళ్లకి వెళ్లినపుడు తనకోసం తెచ్చే బట్టలు,వస్తువుల గురించి..
దీపావళి బొమ్మరిల్లు కట్టడం గురించి..
స్కూలు,కాలేజిలకు వెడుతున్నప్పుడు తనకు తెలియకుండా పెట్టే నిఘా గురించి..

వివరంగా, రిపీటెడ్ గా చెప్తునే  ఉంటుంది.
నిజంగానే ఆదర్శమూర్తులైన అన్నలు దొరికారావిడకి.
ప్రతి సంవత్సరం వారికి శ్రావణ పౌర్ణమికి రాఖీ కట్టడం అనవాయితీ.
ఈ సారి కూడా పోస్ట్ చేసి వచ్చి ఇది వ్రాయడం జరిగింది.

అయితే ప్రస్తుతం వీరి రూపు రేఖలు మారాయనుకోండి.
ఇవి నూత్నయవ్వనంలో ఉన్నప్పటి చిత్ర రాజాలు.

Comments