గొడ్డలి జావ

 చిన్నప్పటి చందమామ కథ గుర్తొచ్చింది.
సెలవు మీద ఊరికి వెడుతున్న సైనికుడు చీకటి పడగానే దగ్గరలోనే ఉన్న ముసలామె ఇంటికి చేరాడు .
ఆశ్రయం ఇచ్చింది గానీఆమె పిసినారి దని పేద ఏడుపులు  ద్వారా గ్రహించాడు.
ఆకలి దంచేస్తోంది.
ఒక ఉపాయం తోచి-
"అవ్వా! గొడ్డలున్నా బావుణ్ణు.కాస్త జావ కాచుకుందును ."అన్నాడు.
ముసలామె కళ్లు ఆశతో పత్తికాయల్లా అయ్యాయి.
గబగబ పెరట్లోకి  వెళ్లి గొడ్డలి తో తిరిగొచ్చి ఇచ్చింది.
మనవాడు నవ్వుకుంటు గొడ్డలిని శుభ్రంగా కడిగి,కుండ నిండా నీళ్లు పోసి,గొడ్డలి ని అందులో పెట్టాడు.
నీళ్లు మరిగాక గరిటతో కలియబెట్టి,ఒక చుక్క నోట్లో వేసుకుని,
"ఉప్పు కాస్త తక్కువైంది."
అన్నాడు.
ముసలమ్మ గబగబ ఇంట్లోకి పోయి ఉప్పు తెచ్చింది.
మళ్లీ కలియ బెట్టి -"కాసిని నూకలుంటే బావుణ్ణు" అన్నాడు. అవీ తెచ్చింది.
ఇలా మొత్తం ప్రక్రియ పూర్తి చేసి హాయిగా జావ తిన్నాడు ముసలామె తో పాటు కడుపు నిండా.

Comments