గొలుసు కధ 1 రెండవభాగం

మహమ్మారి గొలుసు కధ -2
సాకేత్ రోడ్డు మీద నడుస్తున్న డు గాని అతని    ఆలోచన లన్నీ గజిబిజిగా వున్నాయి
చిన్నప్పటినుండి తండ్రిని మత్తు లో ములిగిన వాడిలా చూసేవాడు.
  ఎప్పుడు తెలివిలో వున్నా తల్లిని తిడుతూ, కొడుతూ కనిపించే వాడు.

ఆమె ఒంటి మీద అతడు చేసిన గాయాలు,
మనసును తోడేసే దుర్భాషలు తనలో మిగిలిన
చేదు జ్ఙాపకాలు..
తనెక్కువగా తండ్రి తో మాట్లాడే వాడుకాడు.
ఒక రకమయిన కోపం.. ద్వేషం..
తల్లి ని చూస్తే జాలి.
ఏమీ చెయ్యలేని నిస్సహాయత..
తల్లి తో పోట్లాడి డబ్బులు గుంజుకు పోయి తప్పతాగి ఏ అర్థరాత్రి కో కొంప చేరేవాడు.
ఓ సారి ఏదో అవసరం పడి తండ్రి ని వెదుక్కుంటూ
ఆ దిక్కు మాలిన జాగాకి వెళ్లవలసి వచ్చింది.
అదో నరకం.
కానీ అక్కడ వాళ్లంతా అదే స్వర్గమన్నట్టు తాగి తూలి
పడివున్నారు.
అక్కడ వాళ్లమధ్య గల్లాపెట్టి దగ్గర కూచున్నవాడు మాత్రం దేవేంద్రుడు లా లేడు.
నల్లగా,తుమ్మమొద్దుకి ఎలుగుబంటి బొచ్చు అంటిచ్చినట్టున్నాడు.
అయిదు వేళ్లకీ వుంగరాలున్నాయి.
అవన్నీ తాగుబోతు ల పెళ్లాల పుస్తెలు రూపం
మార్చుకుని వాడి వేళ్ల మీద కూచున్నట్టున్నాయి.
హేబిట్ ఈజ్ ఎ కేబుల్ అండ్ వుయ్ వీవ్ ఎ ధ్రెడ్ టు యిట్ డే బై డే అన్నాడింగ్లీషు వాడు.
సశేషం

Comments