నిజాయితి
"ఇతన్ని చంపాలి"
ఫోటో పరిశీలనగా చూసి - "సరే! రేపు యితని మరణ వార్త వింటారు.పేమెంట్ ముందే చెయ్యండి "అన్నాడు షార్ప్ షూటర్ పరశురాం.
"అలాగే. మీ గురించి వాకబు చేసాను.
మీరు ముందుగా పేమెంట్ తీసుకుంటారని..అలాగే
పనికూడా పూర్తి చేస్తారని విన్నాను.
అందుకే మీదగ్గరకు వచ్చాను."అంటూ
అనుకున్న మొత్తాన్ని అందించాడా వ్యక్తి.
బయటకు వస్తూ' పరశురాం చాలా అందగాడు' అనుకున్నాడు.
తన ప్రియురాలి కోటీశ్వరుడైన భర్తను చంపించడానికి పరశురాం దగ్గరకి రావాల్సి వచ్చింది.
నిజానికి పరశురాం అందగాడే.
ఆర్నాల్డ్ ఫిజిక్ ,మహేష్ బాబు రంగూ..
పరశురాం కు అండర్ వరల్డ్ లో చాలా పేరుంది.
కేసొప్పుకున్నాక డబ్బులు ముందే తీసుకోవడం.. ప్లాన్ ప్రకారం హత్య చెయ్యడం అతని ప్రత్యేకత.
మర్నాడు ఫోటోలో వ్యక్తి యింటి కి చేరుకున్నాడు.
పోష్ లొకాలిటీ లో పెద్ద భవనం.
ఎదురుగా మరో పెద్ద భవనం లేస్తోంది..ఇంచుమించు తయారయిపోయింది .
జాగ్రత్తగా అటువేపునడిచాడు.
పచ్చి సిమెంట్ వాసన..
జాగ్రత్తగా మెట్లెక్కి పైకి చేరుకుని ,సరైన జాగాలో వీపుపై నున్న బేగ్ దింపి ,అందులో నున్న టెలిస్కోపిక్ గన్ కావాల్సిన పొజిషన్లో అమర్చేడు.
చాలా తాపీగా వొక చిత్రకారుడు పెయింటింగ్ దిద్దుతున్నట్టు,వొక శిల్పి కళాకృతి చెక్కుతున్నంత శ్రద్ధగా తన పని చేసేడతను.
ఎక్కడా వుద్వేగం కనపడలేదతనిలో.
రాత్రి తొమ్మిదయింది.
తన క్లయింట్ చెప్పినట్లే ఫొటోలో వ్యక్తి కుర్చీలో కూర్చొని సైగల్ పాటలు వింటున్నట్లు గమనించాడు.
గురి చూసి ట్రిగ్గర్ నొక్కాడు.
ఎదుటి వ్యక్తి టేబుల్ మీద వాలిపోవడం గమనించాక,తన సామగ్రి సర్దుకుని,మెట్లు దిగి చీకట్లో కలిసి పోయాడు.
@@@@
మర్నాడు క్లయింట్ వచ్చాడు.
అతని మొహం సంతోషంతో వెలిగి పోతోంది.
మరోసారి పరశురాం కి కృతజ్ఞతలు తెలియజేసి వెళిపోయాడు.
@@###
మర్నాడు పేపరు లో తన క్లయింట్ హత్యావార్త చదివి,
"సారీ ఫ్రెండ్.. నిన్న నువ్వు వెళ్లేక ఫోటో వ్యక్తి భార్య వచ్చి నిన్ను చంపమని అడిగితే కాదనలేక...యూ నో ఐ యామ్ ఎ సిన్సియర్ డెడికేటెడ్ ప్రొఫెషనల్" అని గొణుక్కున్నాడు పరశురాం.
Comments
Post a Comment