పద్యప్రహేళిక లు

.ఓం శ్రీ గురుభ్యోనమః

ప్రహేళికా బంధువులకు నమస్కారం.

పద్య ప్రేమికులంతా
 ఆహ్వానితులే.

చాలా తేలికైన పద్యం.. తేట తెల్లంగా చెప్పగలరు.
వేడెక్కిన మస్తిష్కాలకు చల్లని ఊటబావి లాంటి పద్యం.

నియమాలు మామూలే.
రెండే జవాబులు.

శరములెన్నయినా చివరి శరమును మాత్రమే జవాబు గా పరిగణిస్తాను.

జవాబులు ఇక్కడ పెట్టరాదు.జవాబును సూచించే క్లూలను కూడా ఇవ్వరాదు.

మెసెంజర్ లో క్లూలను అడగరాదు.మీ జవాబులకు స్పందన మెసెంజర్ లో తెలియజేయబడదు.

మూడు వరకు సమయం.

తే.గీ.పరిగ లేరెడు నిస్వ్యుడు  పరమ భక్తి
మౌని సేవలు సేయగ ముదము నంది
పరమ పదమును జేరగ వరము నుదలె
దెలుప రండయొ వారల దెలివి మీర.

Comments