మహాలయా

మహాలయ
***********
భాద్రపద బహుళ అమావాస్య
నే మేము అంటే ఉత్తరాంధ్రులం మహాలయ(పోలాల) అమావాస్య గా గుర్తిస్తాం.
మిగిలిన ఆంధ్రప్రాంతంలో శ్రావణ బహుళ అమావాస్య నే మహాలయ అమావాస్యగా భావించి పూజలు చేస్తారు.
రేపట్నుంచీ ఆశ్వయుజ మాసం నవరాత్రులు పాడ్యమి నుంచీ మొదలు.
దసరాలు..బొమ్మల కొలువులు..పేరంటాలు..లలితాదేవి పూజలు మనవాళ్ళు చేస్తారు. తెలంగాణాలో బతుకమ్మ పండగ చేస్తారు.
కాని శాక్తేయులైన బెంగాల్ ప్రజలు మాత్రం ఈ పండగ ధూం ధాం గా చేస్తారు.
ఇంటింటికీ తిరిగి నెలరోజుల ముందునుంచీ చందాలు దండడం...
పూజా పెండాళ్లు నిర్మించటం, ఇంటిల్లిపాదీ బట్టలు,నగలు షాపింగు...
కొత్త అల్లుళ్లని పిలవటం..
హోటళ్లు మిఠాయి దుకాణాలు కొత్తకొత్త రకాల
మిఠాయిలు తయారు చెయ్యటం ఆరంభిస్తారు.ఈ తొమ్మిదిరోజులూ ఇంట్లో వంట కార్యక్రమాలు ఉండవు.
పిల్లాపెద్దా అంతా కలసి ఊళ్లో రకరకాల అలంకరణలతో దేదీప్యమానంగా వెలిగిపోతున్న దుర్గా, లక్ష్మీ సరస్వతులు వారికి చెరోపక్కనా అంగరక్షకుల్లా ఉన్న గణేశ,కార్తికేయుల విగ్రహాలు దర్శిస్తారు.
ఆ సంరంభం,వేడుకలు చూడవలిసిందే కానీ చెప్పనలవి కాదు.
చిరుతిళ్ల దుకాణాలు ప్రతీ పండాలు దగ్గర విపరీతంగా జనాలతో నిండి ఉంటాయి.
అమ్మకాలు విరివిగా సాగుతాయి.
కేంద్రప్రభుత్వం బోనస్ కూడా ఆ రోజుల్లోనే ఇస్తుంది.
పెండాళ్ల అలంకరణకు ప్రత్యేక బహుమతులుంటాయి.
అందుకే పోటీపడి రకరకాల డిజైన్లలో పెండాళ్లు డిజైన్ చేస్తారు.
రెడ్ ఫోర్ట్, అసెంబ్లీ,లోటస్ టెంపుల్,విక్టోరియా మహల్ ఇలా...
వృద్ధులు ,నడవలెనివారు మనవలతో ఇంటి దగ్గర పెండాల్ లో కూర్చుని కాలంగడుపుతారు.పగలు పూజ...ప్రసాద వితరణగా ఖిచిడీ,కూర,పాయసం ఇస్తారు.

రాత్రి తొమ్మిదికి "దునోతినాచ్" అని ధూప పాత్రను చేతిలో ధరించి అమ్మ వారి ఎదురుగా రకరకాల విన్యాసాలతో నాట్యం చేస్తారు .అందులో పెద్దవారే కాకుండా ఏడెనిమిదేళ్ల పిల్లలు కూడా ఉండటం విశేషం.
పక్కన సహాయకులు అగ్ని ప్రమాదాలు జరగకుండా చుట్టుపక్కలే తగు జాగ్రత్తలు తీసుకుంటారు.
దశమి నాడు అమ్మ వారిని వేదిక కిందకి దింపేక స్త్రీలు మాత్రమే అ విగ్రహాల చుట్టూచేరి ఆమెకు బుగ్గలకు సింధూరమలదుతారు.
తోటి స్త్రీల చెంపలకు కూడా పూసి అమ్మ వారు ఇన్నాళ్లు తమతో ఉండి ఇప్పుడు అత్తవారింటికి వెళిపోతుందని దుఃఖం ప్రకటిస్తూ తమలపాకులతో కన్నీరు తుడుస్తూ ,పారాణి కాళ్లకు అద్దుతూ భావావేశాలకు లోనవుతారు.దీనినే 'బరుణ్' అంటారు.
అమ్మవారి విగ్రహాలు మట్టితో కొన్ని నెలలముందు నుంచీ కళాకారులు తయారు చెయ్యడం మొదలుపెడతారు.
చాలా అందంగా జీవకళ ఉట్టి పడుతున్నట్టు రంగులతో చిత్రిస్తారు.

యాదేవీ సర్వ భూతేషు...

ఆ తర్వాత విసర్జన యాత్ర మొదలవుతుంది.

Comments