పరమార్ధం

Aim of Education 

Knowest thou the real aim of Education?

It's not just for jobs a 
qualification;
Nor is it for the acquisition of pelf and power 
Nor for the demand of a fat bridal dower.

It's not to produce browsing book-worms 
It's to instill in one noblest norms.

It's a joint venture of the Teacher and the taught 
In to the higher realms of knowledge and thought.

It's to fashion stern people of mettle 
And of fine athletic fettle 

Not like dumb-driven cattle,
But like disciplined soldiers in battle.

It's to increase one's depth of mind and breadth of vision,
To take the right decision in a tight situation.

It's to foster in one character and erudition,
To build a proud and powerful nation.

To eradicate from one of all thought of evil,
To carve out of one a crowning jewel.

To cleanse one of cupidity and corruption,
To make one of probity and distinction.

To pettiness and temptation never to give in,
To make the world a better place to live in.

పరమావధి
*********
తెలుసు కున్నావా ఎప్పుడైనా 
నీవు నేర్చుకున్న విద్య కు లక్ష్య మేదో?

కాదది పురుషార్ధ సంపాదనా మార్గం
కాదది కట్నాల ద్వారా వచ్చే ఐశ్వర్యం
కాదది పుస్తకాల పురుగులుగా ముద్ర వేసే చైతన్యం
గురుశిష్యుల సమవ్వయంతో జ్ఞానశిఖరాలు అందిపుచ్చుకునే మహత్తర యజ్ఞం
నీలో నాలో ప్రవహించే ఉత్సాహాన్ని నియంత్రించి 
శిల్పం లా చెక్కే నైపుణ్యం

చెల్లచెదురుగా నడిచే పశువులను క్రమబద్ధీకరించి
సుశిక్షితులైన సైనికులుగా మార్చే విజ్ఞానం

సరైన సమయంలో తగిన నిర్ణయాలు తీసుకునే విచక్షణను ప్రసాదించే వరం

జాతి గర్వపడే లా శక్తి వంతమైన దేశాన్ని నెలకొల్పే
ఆయుధం

నీలో మలినాన్ని తొలగించి కీర్తికిరీటాల్ని తొడిగే సాధనం
నీలో దురాశ,అవినీతిని కూకటివ్రేళ్లతో  పెళ్లగించి
ఉత్తమునిగా తీర్చిదిద్దే గురుత్వం
నీలో అల్పత్వాన్ని తగ్గించివ్యామోహాల కతీతమైన అందరూ కలలు గనే రామరాజ్యం లో నిన్ను చేర్చే గమ్యం
---ఎమ్మెస్వీ

Comments