మహానుభావులు
****************
వినాయక చవితి.
పెద్దలకీ పిన్నలకీ సరదా ఈ పండగంటే.
మహారాష్ట్ర లోజనంతో భారీగా పూజలందుకునే బొజ్జ గణపయ్య పూజ.
యథాప్రకారం మా అపార్ట్మెంట్ లో కూడా పూజ హడావుడి మొదలయింది.
ప్రణాళికలు సిద్ధమయ్యాయి.
పనుల కేటాయింపు పూర్తయింది.
ఈసారి యువత ఆధ్వర్యంలో జరుగుతుంది అలంకరణ .
బడ్జెట్ కూడా పరుగుతున్న ధరల రీత్యా పెరిగింది.
అపార్ట్మెంట్ లో డెబ్బయి ఇళ్లు తలొకింటికి వెయ్యి వేసుకుంటే డెబ్భై వేలొస్తాయి.అసోసియేన్ ఫండ్ పదివేలు..
ఆరోజు చందాల కోసం నేనూ,రామారావు గారూ చందా పుస్తకం తీసుకుని బయల్దేరాం.
మొదట ఆదిశేషయ్య గారు..
నవ్వుతూ ఆహ్వానించి,వెంటనే వెయ్యి రూపాయలు గూగుల్ పే చేసారు.
ఆతర్వాత వెంకట్రావు, జోగీందర్ సింగూ,కమలేష్ యాదవ్..
అరవ మామీ..
రెండో అంతస్తులో మొదట గుజరాతీ సేటు,పక్కన యాదగిరి .
యాదగిరి పక్కన సల్మాన్ ఖుర్షీద్.
అయన ఏదో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసు లో గెజిటెడ్ హోదాలో రిటైర్ అయ్యాడు.
ఇద్దరు పిల్లలు.. ఫారిన్ లో ఉన్నారు.
తనూ,భార్య వెళ్లివస్తుంటారు ఆరేసి నెల్లకోసారి.
మూసి ఉన్న తలుపులు చూస్తూ ముందుకి నడుస్తున్న మాకు -
"జనాబ్! రావ్ సాబ్ !"
అన్న మాటలు వినిపించి
వెనక్కి తిరిగాము.
నిలువెత్తు సల్మాన్ సాయిబు దబ్బపండు ఛాయలో నెరసిన గెడ్డం తో కనపడి
చిన్నగా నవ్వుతూ కనపడ్డాడు.
బదులుగా నవ్వుతూ వెనక్కి తిరిగాము.
" నా దగ్గర చందా తీసుకోరా రావ్ సాబ్!'
అన్నాడాయన.
"హహ.అదేం...లేదు.మీరు.." నంగిగా అంటున్న నన్ను చూసి..
ఉడికిస్తున్నట్లుగా అప్పటికప్పుడు ఫోవ్ తీసి వెయ్యి రూపాయలు గూగుల్ పే చేసాడాయన.
.....కూడా మహానుభావులున్నారనుకుంటూ అతనికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పి కదిలాము.
Comments
Post a Comment