సారీ షాపింగ్

శ్రావణ మాసం షాపింగ్
కోసం...
సున్నై షాపింగ్ మాల్..
చాలా రద్దీ గా వుంది.
మర్నాడు ప్రళయం వచ్చి జంట నగరాలు ములిగిపోతాయేమో నన్నట్లు జనాలు విరగబడి కొనేస్తునారు.
మా వాళ్ల వెనకాల గొర్రె లా నేను కూడా ఆ మందలో దూరేను.
లోపల అంతా దగ్ధ గాయమానంగా వుంది.
రాత్రి ఎనిమిది ప్పుడు కూడా పట్టపగల్లా కళకళలాడుతూ ,దీపాల వెలుతురు లో మెరిసిపోతోంది.
పనివాళ్లు చేతులు నొప్పిపెట్టేటట్లు చీరలు మడతలు విప్పి,అంచులు,జరీ బోర్డర్,వివరాలు తెలియజేస్తూ అలసి పోతునారు.
కేష్ కవుంటర్లో వ్యక్తి యంత్రంలా పనిచేస్తున్నా అతడి ముందు జనం చేతిలో కార్డ్లూ,నోట్లూ పట్టుకుని విసుక్కుంటున్నారు.
ఎవరికీ ఆకలిదప్పులు లేనట్లు హడావుడిగా తిరిగేస్తున్నారు.
నేను కూడా నా గొర్రె పోజు తో మా వాళ్ల ని అనుసరిస్తూ చుట్టుపక్కల చూస్తూ నడుస్తునాను.
మెల్లిగా దగ్గుతూ.." మనం..ఎటువైపు.. కాటన్ కౌంటర్..అక్కడ.. "
అని చూపించేను..
నా వేపు కోరగా చూస్తూ.. పట్టు చీరల కౌంటర్ వేపు దారి తీసిందావిడ.
నేను యధాప్రకారం నా గొర్రె పోజు లో అనుసరించేను.
మమ్మల్ని చూసి..
రాని నవ్వు తెచ్చుకుని కుర్చీ చూపించేడు .
అతను చూడ్డానికి దుమ్మరిగొండ్లా వున్నాడు.
ధుమధుమ లాడుతున్నాడు.
యజమాని మీద కోపం కష్టమర్ల మీద చూపించడానికి వెనుదీయని రెడీమేడ్ వీరుడ్లా వున్నాడు.
"ఎంతలో..చూపించమంటారు?"
హేళనగా అడిగినట్టనిపించింది నాకు.
"
మినిమమ్ ఎంత.."
నంగిగా అడిగేను.
పురుగుని చూసినట్టు విషపు చూపు వొకటి ఆయాచితంగా పారేసి ..
" మినిమం నాలుగు వేలు"
చూపించమనేసరికి విసురుగా మీద రేక్ నుండి నాలుగు చీరలు పడేసాడు.
అవి అంతగా మా వాళ్లకి నచ్చలేదు..
వాళ్ళు బోర్డర్, జరీ, పైటంచు చూస్తుంటే నేను ప్రతీ చీర మీదున్న లేబిల్ చూస్తున్నాను.
మా వాలకం వాడికి.వాడి వైఖరి మాకు నచ్చక పోవడం తో నేను చుట్టూ చూస్తే కనపడింది.
కేజీ సేల్.
ఒక టేబుల్ మీద వరసగా పట్టు చీరలు పేర్చి వున్నాయి. మీద త్రాసు బొమ్మ వేలాడుతూ వుంది.
"పద ..చూద్దాం "
అంటూ దారి తీసేను.
అక్కడ గోడ మీద కేజీ పన్నెండు వందలు
పదహారు వందలు
పద్దెనిమిది వందలు రాసుంది.
దగ్గర కు వెళ్లి అడిగేను.
" ఒక చీర బరువు యెంత వుంటుందని.
నాలుగు వందల నుండి అయిదు వందల గ్రాముల వరకు వుంటుందని జవాబిచ్చేడు.
అంటే రెండు చీరలు కిలో బరువు వుండొచ్చు.. ఆలెక్కన రెండు చీరలు రెండువేల లోపే..
హాయ్..హాయ్ ..ఇదేదో బావుందే అని మనసులో లెక్కలేసుకుని
" నాలుగు చీరలు తీసుకో..అమ్మాయి కి,కోడలికి యిచ్చినా  రెండు వుంటాయి "అని అనుమతి యిచ్చేసాను.
మా ఆవిడ తన అంచనాల ననుసరించి యేవో నాలుగు చీరలు యెంచుకుంది.
అక్కడి అబ్బాయి నాలుగూ తూచి లేబుల్ తగిలించాడు.
బిల్ నా చేతి కందించాడు.
యధాలాపంగా కళ్లు తిప్పి బిల్ చూసేను.
కళ్లు గిర్రున తిరిగాయి.
ఐదువందల గ్రాముల చొప్పున నాలుగు చీరలు మహా అయితే నాలుగు వేలవాలి.
కానీ బిల్ పదహారు వేల చిల్లరయింది.
అదెలా అనడిగితే అతనిచ్చిన జవాబు-
"సార్!
ఈ శారీ రేటు పదివేల ఎనిమిది వందలు.బరువు నాలుగు వందల ఏభై గ్రాములు...దీని రేటు లెక్క కడితే నాలుగువేల ఎనిమిది వందల అరవై రూపాయలు.
అలాగే మిగిలినవి ..."

నాకేమి వినపళ్లేదు.
గొర్రె చచ్చింది.

Comments