#ఆదివారం వందపదాల కథ
************************
యా దేవీ....
*******
"ఏమండీ!"
'"ఊఁ..". విసుగ్గా అన్నాడు మూర్తి.
" పిల్లాడు నిన్నటి నుంచీ మూసిన కన్ను తెరవట్లేదు.మీరేమో కేంపులంటూ కొంప పట్టక ఊళ్లు తిరుగుతారు.నేనొక్కతినీ ఎక్కడకని తిరగను?"
నిష్టూరంగా మాట్లాడుతున్న భార్యను ఒక్క క్షణం చూసాడు.
'నిజమే కదా 'అనిపించి
"సరే..ప్యూన్ ఆచారిని పంపిస్తాను. మీరిద్దరూ బాబుని పీడియాట్రిక్ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లండి. రేపు నేనొచ్చాక చూస్తాను"
నలభై ఏళ్ల తర్వాత....
"బాబూ! నాన్నగారికి బావులేదురా. కాస్త మంచి డాక్టర్ కి చూపించాలి. తిండి పడిపోయింది. నొప్పులంటారు."
విసుగ్గా టైమ్ చూసుకుంటూ-
*అమ్మా! నాకు మీటింగ్ కి టైమవుతోంది. డ్రైవర్ని తీసుకుని పక్కింటి ఆంటీతో నువ్వే వెళ్లరాదూ..నీ కోడలికి కూడా ఫారిన్ డెలిగేట్స్ తో కాన్ఫరెన్స్ ఉంది.
అయినా ఇవన్నీ ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లెమ్స్. సహజంగా వచ్చేవే.డాక్టర్ మాత్రం ఏంచేస్తాడు. ఓకే. గెటింగ్ లేట్.
నేను బయలుదేరుతున్నా.రా సుజీ!"
భార్య గా అమ్మగా తన కర్తవ్యాన్ని
నిర్వర్తిస్తూ ఆ స్త్రీ అలాగే నిలబడి ఉంది తరతరాలుగా.
****
హామీ
**
ఇది నా స్వంతం.అముద్రితం.
Comments
Post a Comment