యౌగంధరాయణీయం

#కథనకుతూహలం
యౌగంధరాయణీయం
******************

ఆరడగుల మూడంగుళాల పొడవు,వెడల్పాటి ఛాతీ,భారీ విగ్రహం,ఉక్కు లాంటి ఒళ్లు, దీపాల్లాంటి కళ్లు..
కన్నార్పకుండా డిటెక్టివ్ యుగంధర్ వంక చూస్తోందామె. అతని బహిఃప్రాణం,అసిస్టెంట్

రాజు , అమ్మాయి చెప్పబోయే వివరాలు రాసుకోవటానికి సిద్ధంగా పక్కనే ఉన్నాడు.
అమె నెమ్మదిగా ఒళ్లో ఉన్న హేండ్ బేగ్ తెరచి,అందులోంచి అరచేతిలో ఇమిడిపోయే చిన్న పిస్తోలు తీసి యుగంధర్ కి గురిపెట్టింది.
ఢాం..
ఒక్కసారిగా....

"రమేష్ ! చదువుకుంటున్నావా?"
అంటూ గదిలోకి వచ్చిన తండ్రిని చూసి గభాల్న
పుస్తకం మూసి బుద్ధిగా నిలబడ్డాడు.రమేష్.
"చదువుకో.నువ్వడిగిన రిఫరెన్స్ బుక్ వచ్చేటప్పుడు తెస్తాను."
అంటూ బయటకు నడిచాడు రమేష్ తండ్రి.
'అమ్మయ్య' అనుకుంటూ
ఫిజిక్స్ పుస్తకంలో చాటుగా పెట్టిన కొమ్మూరి నవలలో సస్పెన్స్ అతృతగా చదవనారంభించాడు రమేష్.
"ఢాం " అని పిస్తోలు పేలగానే యుగంధర్ కుర్చీని వెనక్కితోసి కింద కూర్చుని ఎదురుగా ఆమె కుర్చీని చేతులతో బలంగా తోసాడు....

చదువుతున్న పుస్తకం పై నీడ పడేసరికి వెనక్కి తిరిగిన రమేష్ కి తండ్రి కనపడ్డాడు.

తోం.తోం..దిరిదిరి  తోం...

*****
ఇది నా స్వంతం...అముద్రితం

Comments