Posts
#నూట పదహారు పదాల చిన్నకథటి(ట్రి)కెట్********రాజమండ్రి రైల్వేస్టేషన్. పుష్కరాల మూలంగా చాలా రద్దీగా జనం.పెళ్లి కొచ్చిన బంధువుల్ని బండి ఎక్కించడం తప్పనిసరి డ్యూటీ.బండి కదిలేదాకా ఏం మాటాడాలో తెలియని బోరింగ్ పని.గత నలబై ఏళ్లు గా రైల్వేలో సర్వీసు చేసినా ఏనాడూ ప్లాట్ఫామ్ టికెట్ కొనని రాజారావు బుకింగ్లో చేయి దూర్చి ప్లాట్‌ఫాం టికెట్ ఇమ్మన్నాడు.సర్వీసు లో లేకపోయినా పెన్షన్ ఇస్తున్న రైల్వేవారికి లాభం చెయ్యాలని అతని ఉద్దేశం."ఏభై రూపాయలు" అని బుకింగ్ క్లర్క్ అనగానే షాక్ కొట్టినంతపనయ్యింది.సింగిల్ డిజిట్లోంచి డబల్ డిజిట్లోకి వచ్చిందని తెలుసు గానీ మరీ యాభై రూపాయలా!వెంటనే చెయ్యి వెనక్కి తీసుకుని పక్క కవుంటర్లో క్యూలో నిలబడి కొవ్వూరు కు టికెట్ ముఫ్ఫై రూపాయలకు తీసుకున్నాడు. ప్లాట్‌ఫాం మీదకి వచ్చిన ఫలక్ నామా లో సెకెండ్ ఏసీ లో బంధువుల్ని ఎక్కించి,బండి కదిలాక వెను తిరిగి బయటకొస్తూ ఎదురు చూసాడు.ఎవరూ లేరు.విజిలేసుకుంటూ టికెట్ కేన్సిలేషన్ కౌంటర్ వేపు నడిచాడు.హామీ.స్వంతం.అముద్రితం

- Get link
- X
- Other Apps