తరం మారింది



#కథన కుతూహలం

తరం మారింది
**********
"రేఖా! ఒళ్లు కాస్త సలపరించి‌నట్టుంది.బియ్యం పడేసాను.అది‌కాస్త చూస్తూ దుంపలు వేచి చారు పెడతావా?"

"పనిమనిషి ని పెట్టమంటే వినిపించుకోవు..."అంటూ
తల్లి ఒళ్లు ముట్టుకుని చూసి-
'సరే' నంటూ వంట గదిలోకి నడిచి పనిలో పడింది.వంట చేస్తున్నంతసేపూ తల్లి చాదస్తానికి విసుక్కుంటునే ఉంది.

గంట పని అలవాటులేని కారణంగా రెండు గంటల్లో ముగించుకుని 'ఉస్సు'రంటూ తల్లి దగ్గరకొచ్చింది.
తల్లి నిద్రలో ఉండటంతో, తన గదిలోకిపోయి సిస్టం ముందు‌కూర్చుని రేపటి ప్రెజెంటేషన్ సిద్ధం చేసుకోసాగింది.

రేఖ తల్లి 
ఇంతకుముందు పనిమనుషులతో పడిన‌పాట్లు గర్తు చేసుకుని, ఆ బాధలు‌పడలేక తనే చేసుకుంటోంది ఇన్నాళ్లూ.భర్త  , కూతురు పనిపిల్లని పెట్టుకోమని శతవిధాల చెప్పినా వద్దని‌ ఇలాగే హాయిగా ఉందని ఓపిగ్గా చేసుకుంటోంది.
ఒక్కోసారి పనెక్కువనిపించినా సర్దుకుని అలవాటు చేసుకుంది.
తనక్కావలసిన విధంగా ఇంటిని తీర్చిదిద్దుకుంటోంది.

మర్నాడు-
తను లేచేసరికే మందులు పనిచేసి తేలికగా ఉంది. కొత్తవాళ్ల మాటలు వినపడటంతో బయటకు వచ్చి చూసిందావిడ.
రేఖ ఎవరో కొత్తపనిమనిషితో మాట్లాడుతూ పని వివరాలు చెప్తోంది.
తరం మారింది.తనూ మారాలి.

Comments