పేరు -మారుపేరు

పేరు -మారుపేరు
పేరు లో ఏముంది అన్నాడో కవి.పేరు లో ఏమున్నా లేకపోయినా మారుపేరు లో మాత్రం చాలా వుంది.
మీనాక్షి కళ్లు చేపల్లా వుండక పోవచ్చు రామారావు కి చాలామంది ఆడాళ్ల తో పరిచయం వుండొచ్చు.కృష్ణ మూర్తి ఏక పత్నీవ్రతుడిగా నిలబడొచ్చు.
వీళ్లంతా సార్దకనామధేయులు కాకపోవచ్చు.
కానీ మనిషి కుండే మారుపేరు మాత్రం చాలాకాలం చిరస్థాయిగా వుండిపోతుంది.
నెను విజయనగరం లో చదువుకునే రోజుల్లో మా అద్దెయింటి పక్క వాటాల వాళ్ళందరినీ మారుపేర్లతో వ్యవహరించే వాళ్ళం.ఒహాయన పేరు కర్కోటకుడయితే వాళ్ల మ్మగారు కద్రువ. గమ్మత్తుగా ఇప్పటికీ వాళ్లనలాగే అందరం వ్యవహరిస్తూ వుంటాం. ఇహ కళాశాల లో అధ్యాపకులుకుండే మారుపేర్లు జగద్విదితం. అసలుపేరు కన్నా మారుపేరు తోనే వాళ్ల ని గుర్తించగలం.
కొసమెరుపు
అల్లరి గా వున్న తరగతిలో ప్రిన్సిపాల్ అడుగుపెట్టి
ఎవరి క్లాస్ అనడగ్గానే వెనుక నించీ నక్సలయిట్ అని వినపడింది.

Comments