నేను-నా-వి-స్మృతులు-2

1976 లో డిగ్రీ పూర్తయ్యాక మళ్ళీ మానాన్నగారి దగ్గరికి ఖరగ్పూరు వచ్చే సాను.అప్పుడే రాయాలన్న దురద ఎక్కువై భయం అని మినీకధ రాసి ఆంధజ్యోతికి పంపేను.పురాణం వారు అప్పట్లో సంపాదకులు. అది అచ్చయిన సంగతి నాకు తెలియగానే నాఆనందానికి హద్దుల్లేవు. పదిసార్లు అచ్చులో పేరు చూసుకుని మురిసిపోయాను.అదేవూపులో మరో మినీకధ చిట్కా పంపేను.అది కూడ అచ్చవడం, పారితోషికంగా చెరో30రూ.అందుకోవడం జరిగింది.
అంతే.
నాలో వుత్సాహంకట్టలు దాటింది. సత్యజిత్‌రాయ్ కార్వస్ కద అనువదించి శర్మగారికి పంపేను.అదచ్చయ్యాక కాలర్ కొంచెం పైకి లేపి మహాశ్వేతాదేవి సన్ అఫ్ గంగ కధ గంగపుత్రులు పేరు తో పంపేను.అది కూడాఅచ్చుకాగానే బెంగాలీ వాసన ఒదిలించుకుని కానన్డాయిల్ డిటెక్టివ్ షెర్లాక్ హోమ్సు కధ ఎవరుదోషి పంపేను.శర్మగారు అభినందిస్తూ దాన్ని కూడాప్రచురించేసరికి నా ఛాతీ వుబ్బి నాకు నేనేరావిశాస్త్రిగార్లా ఫీలయిపోయను.ఆపొంగు లోనే మరో నాలుగు కధలు వేరేపత్రికలకి పంపడం,వాటికి అడ్రస్ లేకపోవడం జరిగింది. కొంచెం చల్లబడ్డా దురదేమాత్రం తగ్గలేదు
అదిగో అలాంటప్పుడు వచ్చే డు మాదొడ్డమ్మ కొడుకు రామవరపు వేణుగోపాలరావ్.అప్పటికే అతను ఈనాడు డైలీలోపన్చేస్తున్నాడు.అప్పటి కి నిరుద్యోగి గావున్న నన్ను తనతోరమ్మన్నాడు.మారాలో చన లేకుండా ఓశుభ(?)ముహూర్తంలో హైదరాబాదు బయలుదేరాను.రాత్రి ట్రెయిన్ లో జోళ్లెవరోకొట్టేసారు.ఎలాగోలా హైదరాబాద్ లోదిగిఖైరతాబాదు చింతల్బస్తి లో వుండే మావాడింటికి చేరుకున్నాను.నవ్యశర్మ అప్పుడు అక్కడే పరిచయమయ్యాడు
ఆమర్నాడు మావాడు నన్ను ఈనాడు ఆఫీసు కి తీసుకెళ్లాడు .అక్కడి వ్యవహారం చూసేక నాకనిపించింది నేను ఎంతబచ్చాగాణ్నో అని.
ఆఖరి భాగం మరో విడతలో

Comments