​బెంగాలీ దాదా-2

బెంగాలీలు అందరిని దాదా అని సంభోధిస్తూ వుంటారు
వయసుతారతమ్యాలు బట్టి కాకు(చిన్నాన్న) ,జెఠు(పెదనాన్న),దాదు (తాతగారు),స్త్రీలలో అయితే వయస్సు ల బట్టి దీదీ(అక్క),మాసిమా(పిన్ని),జెఠిమా(దొడ్డమ్మ) ,పిసిమా(మే నత్త) ,కాకిమా (చిన్నాన్నభార్య) పిలుస్తూ వుంటారు. ఇందులో మళ్ళీ ఓ గమ్మత్తు వుంది అమ్మాయి లు అబ్బాయిల్ని దాదా(అన్నయ్య)  అని పిలుస్తారు కానీ ప్రేమ లో పడే సరి కి అంతవరకూ దాదా గాపిలవబడ్డవాడే ప్రియుడు గా మారిపోతాడు.
ఇహ ఆఫీసు ల్లో దాదాలు కోకొల్లలు.మీరు దాదా అని పిలిచిన ప్రతివాడూ మిమ్మల్ని కూడా దాదా అనే పిలుస్తాడు.అయితే దాదాని కుదించి దా ని పేరు చివర కలిపే స్తారు.వుదాహరణ కి మీపేరు ఏదో రామారావైతే రావ్ దా అంటారు.
బెంగాలీ  బహు సరళమైన సుందరమైన తేలికగా పట్టు బడే భాష.కానీ వీళ్లకి వ అక్షరం వుండదు.వ ని భ గా పలుకుతారు.వుదాహరణ కి వీళ్ల ఉఛ్చారణ ఈ వాక్యం లో చూడండి.
మిష్టర్ భెంకట్రాబ్ భై ఆర్యూ భాండరింగ్ యిన్ ద భరండా?
ఇలా వుంటుందన్నమాట.
ఆఫీసు ల్లో కూడా స్ధానికుల కన్నా స్ధానికేతరుల అంకితభావం పనిపాటల్లోమనం స్పష్టంగా గమనించగలం
నిజాయితీ పరులు వారిలోనూ లేకపోలేదు గానీ వాళ్ళు అల్పసంఖ్యాకులు.
కానీ వారు స్త్రీల కిచ్చే స్థానం అపురుపం.నేటికీ బస్సుల్లో స్త్రీలు జాగాలేక నిలబడి వుంటే కూర్చున్న పురుషులు లేచి వారికి జాగా చేస్తారు.అలాగే ఇంటి పనులు కూడ పురుషులే పిల్లలను తయారు చేయటం,వూడ్చటం,అలకటం,తోమటంతో సహా అవలీలగా చేసేస్తుంటారు.కావాలంటే రైలు ప్రయాణాల్లో ఈ సారి గమనించొచ్చు.
మరో  విషయం కూడా వారిలో నాకునచ్చేది నడిరోడ్డవనీ,ప్లాటుఫారం అవనీ గురుతుల్యులు,పెద్దవాళ్ళు ఎదరైతే కాళ్ళకు వంగి నమస్కారం చేస్తారు ఎంత హోదాలో వున్నప్పటికీ.
మిగిలింది మరోసారి

Comments