విషధర రిపుగమనునికిని
విషగళసఖునికని విమలవిషశయనునికిన్
విషభవభవజనకునికిని
విషకుచ చనువిషము గొనుట విషమే తలపన్
భాగవత దశమస్కంధం లో పోతన గారి వర్ణ న చూడండి
విష నాగుల శత్రువు గరుడపక్షి ని వాహనంగా కలవాడు
విషగళ సఖుడు అంటే విష సర్పాలను కంఠాభరణాలుగా ధరించిన శివుడికి స్నేహితుడు
ఆదిశేషుని పై శయనించే వాడు
నీటినుండి పుట్టిన పద్మం నుండి పుట్టిన బ్రహ్మ గారి తండ్రి
పూతన చనుబాలలోని విషాన్ని గ్రహించ లేడా
ఇన్ని విషాల మధ్య తిరిగే పెద్దమనిషి కి పూతన చనుబాలో లెక్కా
Comments
Post a Comment