1965-69వరకూ సోంపేట లో ఫోర్తుఫాం వరకూ చదివి తరువాత చదువు కోసం నేను మా మేనమామ గారి పిల్లలం విజయనగరం లోని అద్దె యింట్లో కాపురం పెట్టాం.మా కు వంటావార్పు,బాగోగులు మాఅమ్మమ్మ చూసేది.ఆవిడ ఆడ హిట్లరు లా మమ్మల్ని శాశించే ది కాబట్టి మేమంతా భయభక్తులు (?)తో మెలిగెవాళ్లం.మా వాళ్ళు బెంగాలులో రైల్వే ఉద్యోగం చేస్తూ మాకు నెలనెలా డబ్బు పంపేవారు.
గుండాలవారి వీధిలోవున్న నండూరి వారి రెండంతస్తుల మేడ లో ఆరువాటాల లొ ఒక మూలవాటలో మే ముండేవాళ్లం.ఆ యింటి ఎదురు సందులో నే మిత్రులువెంకటరత్నం గారు యిప్పటికి వుంటున్నారు.మిగిలిన ఐదువాటాల్లో ఒకదాంట్లో జువాలజి లెక్చరర్ కమలమ్మగారు ఆవిడ ఎదురువాటాలో బ్రుక్బాండ్ ఏజెంటుగారుమాపక్కవాటాలొ కమీషన్ ఏజంటు శ్రీ రామచంద్రమూర్తిగారు ఆ పక్కవాటాలో సంగీతం చెప్పే టీచరమ్మగారు, తమ్ముడు వాళ్లతల్లిదండ్రులతోపాటుండేవారు.శ్రీరామచంద్రమూర్తిగారు దీపావళికి చాలా మందుగుండు సామానులు తెప్పించి అందరిచేతా కాల్పించేవారు.
బొంకుల్దిబ్బ లో కూరలబజారు,ఎదురుగా రాజు గారికోట అందులో విమెన్సుకాలేజ్,ఎగువ మూడుకోవెళ్లు,సాయంత్రం కోటేశ్వర్రావ్ భాగవతార్ హరికధలు,కూరల్లోకొట్టేసిన డబ్బల్తో బావమరిది తోకలసి వన్బైటు సిగరెట్లు తాగుతు మ ఎమ్మార్కాలేజిహాస్టల్ ఫ్రెండ్ల గదులలో పిచ్చాపాటి లు,అప్పుడప్పుడు సంస్కృత కాలేజీ వేడుకలలో మానాపురంశేషశాయి గారి ఉపన్యాసాలు, స్టేడియంలో జరిగిన తెలుగుమహాసభలు,మూడులాంతర్ల దగ్గర టీకొట్లో చాయ్ తాగడాలు,
ఎన్నో అనుభవాలు …అప్పట్లో నే మొదటిసారిగా నేరెళ్ల వారి ధ్వన్యనుకరణ వినడం జరిగింది. మంగళంపల్లి వారిని సత్కరించి వూరేగించడం చూసేను.
ఆ రోజుల్లోనే బొంకులదిబ్బ దగ్గర పాన్షాపు బెంచి మీద కూచుని చర్చలు జరిపే కొందరు పరిచయం అయ్యారు. తెలిసిందేమంటే వాళ్లు 21సెంచరీఅభ్యుదయదచయిత సంఘసభ్యులని.కొద్దిసేపుమాటలయాక “పదండి అరతులం వేసుకుందాం”అన్నాడు ఆసంఘసభ్యుల్లోఒకడైన నిష్టల వెంకటరావు గారు.అర్దంకానట్టు చూస్తున్న నన్ను చసి నవ్వుతూనే ఎదురుగావున్న ఇందిరాకేఫ్ లోకి దారి తీసాడాయన.అప్పుడర్దమయింది నాకు అరతులం అంటే వన్బైటూకాఫీఅని.
అంతవరకు అద్దెకు కొమ్మురిసాంబశివరావు నవలలు చదివే నాకు వారి వల్లనే రావిశాస్త్రిగారి రచనలు పరిచయం అయ్యాయి.
మొదటి భాగం సమాప్తం

Comments
Post a Comment