బెంగాలీ దాదా

బెంగాలీయులు శాక్తేయులు. శక్తి రూపాలైన దుర్గ,కాళీ ఆరాధకులు.దసరాల్లో దుర్గాదేవిని, దీపావళిరోజుల్లో కాళీమాతని విశేషంగా పూజిస్తారు.వేలు,లక్షలు ఖర్చుతో చాలా అట్టహాసంగా జరుపుతారు. అందరి దగ్గర చందాలు కుడా బాగా వసూలు చేస్తారు.దానికి తగ్గట్టుగా కేంద్రం అదేసమయంలో బోనస్ యిస్తారు.పెద్ద పెద్ద పెండాళ్లు వేసి,విద్యుత్ దీపాలలంకరించి కనులపండువుగా జరుపుతారు. కొన్ని నెలల ముందు నుంచే వీళ్ల దసరా హడావిడి మొదలై కాళీపూజతో అంతమవుతుంది. ఇంటిల్లపాదీ కొత్త బట్టలు ,యితర అలంకరణ సామగ్రి తమతోపాటు సన్నిహిత బంధువులక్కుడా తీసుకుంటారు.
ఆరోజుల్లో వంటాపెంటాఎగ్గొట్టి షాపింగ్‌ చేస్తూ వీలయినంతవరకూ హోటళ్లని పోషిస్తారు.బెంగాల్ స్వీట్లకి ప్రసిద్ధి. ఇక్కడి చెనామిష్టి(పాలవిరుగు తో చేయబడే రసగుల్లా వంటివి) మరెక్కడా దొరకవుభాద్రపద  బహుళ అమావాస్య..మన పోలాల అమావాస్య 
నాడు నాలగురోడ్ల కూడలిలో మైకులు పెట్టి
బీరేన్ భద్ర కృష్ణ పాడిన చండీపాఠ్(దుర్గా సప్తశతి..చాలా బావుంటుంది) వినిపిస్తారు.
పంచమి నాడు రకరకాల డిజైన్లతో పెండాల్
కట్టి అందులో దుర్గా,లక్ష్మి, సరస్వతి, గణపతి, కుమారస్వామి ని ప్రతిష్ట చేస్తారు.
ఇహపోతే--
 బెంగాలీ వాళ్ళు రాజకీయాలంటే ఒళ్ళు మరిచిపోతారు.నలుగురు కలిస్తే చాలు రాజకీయ చర్చే.సబర్బన్ లోకళ్లలో ప్రయాణించే వారు మసాలా ముడి(మరమరాలు)తింటూ రాజకీయాలు నంజుకుంటూ పేకాడుతూ కాలక్షేపం చేస్తారు.వీళ్లకి గాంధీ, నెహ్రూ లంటే ఒళ్లుమంట.నేతాజి ఆరాధ్యదైవం.
వీరికి లలితకళలు మీ ద మక్కువ ఎక్కువ. ప్రతి రెండు మూడిళ్లలో అబ్బయి లేదాఅమ్మాయి గాన/వాద్య పరిచయం కలిగివుంటారు.
వీరికి భాషాభమానమేకాక స్వజాతి అభిమానం కూడా చాలా హెచ్చు.ఆఫీసు ల్లో యీ విషయం స్పష్టంగా కనపడుతుంది. బెంగాలీరాని తెలుగు ఆఫీసరు మీద యధాశక్తి చాడీలు తమ స్వజాతి పెద్ద ఆఫీసరు కి చేరవేస్తారు.ఇహ యిల్ట్రీట్ మెంట్ సంగతి బెంగాలేతరులకు బాగా అనుభవమే.
అన్నట్టు దసరాల్లో విజయదశమి నాడు ముప్ఫై అడుగుల రావణాసురుడు ని కాలుస్తారండోయి.
మిగతా విశేషాలు మరోసారేం.

Comments