కలకత్తా మహానగరానికి నూటపదిహేను కి.మీ.దూరంలోవున్న ఖరగ్పూరు పెద్దజంక్షన్.ఇక్కడ నుంచీ అన్ని వేపులకి వెళ్ళే రైలు మార్గాలు వున్నాయి. అతి పెద్ద రైల్వే కోలనీ,బోగీలు రిపేరుచేసే పెద్ద వర్కుషాపు,ప్రింటింగ్ ప్రస్ వున్నాయి. ప్రపంచం లో అతి పొడవైన రైల్వే ప్లాటుఫారం రికార్డు స్వంతం చేసుకుంది.ఐ.ఐ.టి లో వివిధ ప్రాంతాలనుంచి విద్యార్థులు వచ్చి చదువుకుంటుంటారు.
మా నాన్నగారు 74రైల్వే సమ్మె లో పాల్గొన్లేదు కాబట్టి లాయల్ వర్కర్ కోటా లో నాకు సబసిస్ట్యుట్ గా వేయించేరు.
ఇహ రైల్వేకాలనీ పెద్దదే గానీ ఎప్పుడో బ్రిటిష్ వాళ్లు కట్టిన ఇళ్ళు తో పాటు నాసిరకం సామానుపయోగించి మనవాళ్ళు కట్టిన అగ్గిపెట్టి ల్లాంటి యిరుకుముద్ద యిళ్ళు వరసావావీ లేక దర్శనమిస్తాయి. ముఖ్యంగా కొత్తకోలీ,నింపురా వేపుండే గోల్కోలీ యిళ్ళు అప్పట్లో బ్రిటీష్ వాళ్ళు గుర్రపు సాలగా వాడేవారని నానుడి.ఒంటిద్వారంతో రైలు పెట్టి లాకిటికి ల్లేకుండా వుండే ఆ ఇళ్ళలో జనాలు ఎండాకాలం ఎలా ఉండే వారో వూహాతీతమైన విషయం.
అయితే ఆఫీసర్ల బంగళా లు మాత్రం చాలా విశాలంగా బావుంటాయి. మధ్య తరగతి గోచికిచిన్నగావంచాకి పెద్ద వుద్యోగుల ఆవాసాలు మాత్రం అంతంత మాత్రమే.
ఇహపోతే పేరుకి బెంగాలు దేశమైనా అక్కడ బెంగాలేతరులే ఎక్కువ. అందులో మళ్ళీ సగంకన్నా ఎక్కువ తెలుగు వాళ్లే.అందుకే అందరూ దీన్ని సెకెండ్ ఆంధ్రా అంటారు. రిక్షా వాలాలు,కూలీల లో అధిక సంఖ్యాకులు తెలుగు వాళ్లే.కాకపోతే హిందీ లోమాట్లాడుతుంటారు.విశాఖపట్టణం రైలు లో పన్నెండు గంటలు దూరం కాబట్టి వ్యాపారులు వారంవారం అవసరమైన సరకులు తెచ్చి అమ్మతుంటారు.
ఇక్కడ బెంగాలీ యులకి జాత్యభిమానం హెచ్చు. వుద్యోగుల్లో యీ సంగతి బాగా తెలుస్తుంది. కానీ వాళ్లలో ఓగుణం నాకు బాగా నచ్చింది. ఎంత తక్కువ ఆదాయం సంపాదించే వాడైనా తొందరగా స్వంతయిల్లు కట్టుకోవాలని ప్రయత్నం చేస్తాడు.
నేను కూడ ఓ అయిదారెడినిమిది వందల చదరపుగజాలో అడుగులో డెసిమల్సో వాపీకూపతటాకారామ నిధినిక్షేపసహితంగా కొనుక్కోవడం గురించి మానాన్న గార్తోఆలోచించాను గానీ ఆయన చప్పరించి యీ బంగాళీవాళ్లు మనల్ని తరిమెయ్యరని గేరంటి ఏమిటి అనగానే నేను కూడ వెనక్కి లాగీసేను.అంచేత ఆకల యిప్పటికి కలగానే వుండిపోయింది.
ఇలా సంవత్సరం తిరిగేసరికి నా పెళ్లి మామేనమామ కూతురి తో అయిపోయింది. ఆ తరవాత అమ్మాయి మరొ నాలుగు ఏళ్లకి అబ్బాయి …సంసారం …సాగరం..
నా సొద కి స్వస్తి

Comments
Post a Comment