అమ్మ నగలు
***********
అవే...
అమ్మ జుంకాలే...గొలుసులే
చిన్నప్పటి నా ఆటవస్తువులే
మెరుస్తూ...ఊగుతూ...
పచ్చగా..వెచ్చగా...
అమ్మ ప్రేమలా...
అవే మార్వాడి దుకాణంలో
చల్లగా..కదలకుండా...
నా చదువు కోసం నడిచొచ్చాయి
నాన్న సాయంతో..మన్నుతిన్న పాముల్లా...
అయినా..
అమ్మ మొహంలో మార్పు లేదే..
ఎప్పటిలా చక్కగా..అందంగా..
నవ్వుతూ...
స్వార్ధరహితమైన ఆ ప్రేమకు
ఖరీదు కట్టే షరాబు లేరీ?
Comments
Post a Comment