తెల్ల వారింది.
కళ్ళు తెరుస్తూండగానే ఇవాళ నాకు కేటాయించబడ్డ ఆదివారం పన్లన్నీ గుర్తుకొచ్చి గుండె గుభేల్మమంది.
క్షవరం ..కోవెల..కూరలు..నాన్న మందులు ..పచారికొట్లో నెలసామాన్లు..
గబగబ లేచి కాలకృత్యాలు కానిచ్చి సెలున్ దారి పట్టాను.వీధులన్నీ కళకళ్లాడుతు ఎప్పటిలాగే మామూలుగానె వున్నాయి.
సెలూన్ కూడా రద్దీలేకండా ఖాళీగా వుంది.అలవాటైన క్షురకుడు తలమీద వున్ననాలుగువెంట్రుకల్ని సర్దడానికి యధాశక్తి శ్రమ పడ్తున్నాడు.
పావుగంట గడిచాక నా పని పూర్తయింది.లేచి జేబులో చెయ్యి పెట్టి డబ్బులు తీయబోయేలోగానే నాముందు కార్డ్స్వైపింగ్ మిషను ఎదురయింది. భలే భలే అనుకుని ఆప్రకియ పూర్తికానిచ్చి యింటి దారిపట్టాను
బాత్రూంలో స్నానంచేస్తూండగా కూర లమ్మాయి కేక విన్పించింది.
గబగబా తయారై బయటకి వచ్చే సరికి మాఆవిడ చింకి చాటంత మొహంతో ఎదురై ” ఇది విన్నారా కూర లామె దగ్గర కూడా స్వైపింగ్ మిషనుందట” అనగానే నేనూ తొందరగా కార్డందించేను.
హమ్మయ్య రెండుఘట్టాలయ్యాయి.
మందులు,కోవెల …మెడికల్ షాపు వేపునడిచాను.లక్కీ గా అక్కడ కుడా కార్డ్ పేమెంటే.
నోట్లరద్దు తర్వాత జనాలు బాగా అప్డేట్ అయ్యారన్నమాట.
ఇహ కోవెల.
దూరంగా రామకోవెల గంటలు ..
చాగంటి ప్రవచనం వినపడుతునాయి.
దగ్గరగా వున్న ఎస్బిఐ ఎటిఎమ్ ల దగ్గర జనాలే లేరు.
కోవెల లో దైవదర్శనమయ్యాక కోవెల మెట్లు దిగుతూ చూసేను
యధా ప్రకారం బిచ్చగాళ్ళు బార్లు తీరి కూర్చున్నారు.
నాదృష్టిలో పడిందప్పుడు.
అందరి కన్నాముందు కూర్చున్న వ్యక్తి దగ్గర కార్డ్స్వైప్ మిషన్.
హమ్మ మోడీ! అనకోగానే నా మొహంమీద నీళ్ల జల్లు పడిపెద్దగా కేకలు మా ఆవిడ గొంతుతో.
” మీకింకా తెల్లార్లేదా.అవతల మళ్ళీ క్యుపెరిగిపోతే నన్నని లాభం లేదు.ముందే చెప్తున్నాను”
నా కళ్లు గిర్రున తిరిగాయి.
Comments
Post a Comment