నేను గొలుసు కధ గా కాకుండా విడిగా ఆ నాలుగు వాక్యాలకు వేరే ముగింపు రాయాలనుకుంటున్నాను.
పేరివారు,మరినీడి వారు శర్మగారి కధనే గొలుసు కధగా మలిచారు.
ఇహ కధలోకి వస్తే...
.....శేఖర్ కి అంతా అగమ్యగోచరంగా వుంది.
తండ్రి ఎక్కడికి వెళ్లి వుంటాడు.
దారి లో లఘశంక కోసం తండ్రి కారు దిగినపుడు తన ఆలోచనల్లో తనున్నాడు.
తండ్రి ఎప్పటికీ రాకపోయేసరికి
తనకు సందేహం కలిగి బయటకు వచ్చేడు.
కాస్సేపు తచ్చాడి ఎందుకయినా మంచిదని కారంతా వెదికాడు.
అప్పుడు కనిపించిందది.
వెనక సీటు కింద ఓ కవరు.
అందులో వుత్తరం.
గబగబ తీసి చదవనారంభించేడు.
చి.శేఖర్,
నా గురించి నువ్వు దిగులు పడకు.
నీపరిస్ధితి,వేదన నేనర్ధం చేసుకోగలను.
దగ్గరగా వుండి చికాకులు పడేకన్నా దూరం గా వుండి సంబంధం మెరుగు పరచడం మంచిది.
నేను నా బాధ్యతలు అన్నీ సక్రమంగా నిర్వర్తించే ను.
నువ్వు కూడా నీ కుటుంబం తో సుఖంగా వున్నావు.
నీ బాధ్యత నువ్వు సక్రమంగా నెరవేర్చే ప్రయత్నం చెయ్యి.
నీ పిల్లల్ని వృధ్దిలోకి తెచ్చే ప్రయత్నం చెయ్యి.
నా ఆశీర్వాదం మీ అందరికీ ఎప్పుడూ వుంటుంది.
ఇహ నా సంగతంటావా
నా పెన్షన్ నాకుంది.
నాకు ఎప్పటినుంచో సంపూర్ణ భారతయాత్ర చెయ్యాలనుండేది.
ఈ రూపంలో అది తీరనుంది.
నే నిక్కడనుంచి తిన్నగా విశ్వేశ్వర నగరం కాశీ చేరుకుని,అక్కడ పవిత్ర గంగా స్నానం తో నా యాత్ర ఆరంభిస్తాను.
నా గురించి బెంగ అనవసరంగా పెట్టుకోకు.
అన్నట్లు.. మరో విషయం...
ఎవరు అడిగినా నన్ను తీర్ధయాత్ర లకు తెలిసినవాళ్లతో పంపించినట్లు చెప్పు.
దాని వల్ల నీకు చెడ్డపేరు రాదు.
నాకేమయినా అవసరమయితే
నీకి కబురు చేస్తాను.
మరోసారి ఆశీర్వాదాలతో
నాన్న
Comments
Post a Comment