గంగరాజు గారి అభినందన కమనీయ సీసంలో

సీ: బేస్తవారమునందు భేషైన నుడికట్టు
           రంగరించి నొసగు రస పిపాసి!
     క్విజిలు నామమునిచ్చి వేడ్కతో వింతలు
           కవ్వించి మనపైన రువ్వు వాడు!
     వెన్న వంటి మనసు జున్ను వంటి పలుకు
           కలబోతగాఁ నొప్పు వలపు కాడు!
     భాగవతుల యింట భాగ్యాల పంటగా
           ప్రభవమొందిన మేటి బాంధవుండు!

గీ: కృష్ణరావాఖ్య విప్రుండు కీర్తిఁ గామి
    భళిర! శేముషీవర్యుడా! భవ్య చరిత!
    శ్రీలు శుభములు సౌఖ్యముల్ సేమమలర
    నీదు సొంతము గావాలి నిశ్చయముగ!

సన్మిత్రులు Krishna Rao Bhagavatula గారికి జన్మదిన శుభాకాంక్షలతో......
.....ఎమ్మెస్వీ గంగరాజు
     మకాం: హైదరాబాద్
     తేదీ: 13.02.2019.

Comments