వారే మేలిమి బంగరు
వారే కవివర కథకులు వాసిని జూడన్
వారే సారధి మాకును
వారే! ఏమని పొగడుదు వాక్కులు లేవే!
#
ముసలము ముదిమే గద
మసలుట యాతన గాదే మరిమరి జూడన్
మసకగ మారిన జూపులు
ముసిముసి వెదుకగ జూడవె మరలిన వయసే
#
చపలురు,చోరులు,జారులు
నిరతము దిరిగెడు ధరణిని నిన్నే వదలక
మరువక తలచెడి సుజనుల
మరిమరి జూడగ నభమును వీడి నావే!
#
మేలిమి రూపము గూడను
కాలము లోబడి కురూపి కాదే తెలియన్
మేలుగ జేసిన పుణ్యమె
కాలము దాటియు నిలుచును కనరే నిజమున్
#
కాయము గోరగ వేషము
వేయుట జనులకు సహజము వేషము దీయన్
స్వీయజనములే నగుదురు
దాయకుడై యుండవలెను దయతో నెపుడున్
#
తరువే యొసగును జీవము
తరువే యగులే కడపటి తల్పము కూడా
తరువే యిచ్చును సకలము
తరువే లేనీ జగమును తలపగ లేమే
#
చూడర తమిళుల గోలలు
వాడర నీటిని పొదుపుగ వరమే యనగా
కాడుగ మారదె జగమే
వేడగ గ్రుక్కెడు జలములు వేలమె యగునో
#
గురువే దీర్చును కోరిక
గురువే ,దైవమ్ము బ్రహ్మ గురుతర మూర్తే
గురువే చూపును మార్గము గురువే మోక్షము నిడగల గుప్తజ్ఞానే
#
చీకటి మూసిన యడవిన
కూకటి వేరుల యవిద్య కూరిమి మీరన్
వాకిట నిలచిన చాలును
నాకమె నేరుగ దొరకును నమ్మగ గురువున్
#
ఎల్లలు లేవే వీరికి
ఉల్లము ఝల్లను సవాలు కోరే వీరే
పల్లక పొత్తపు సారము
ఎల్లను నుడివెడు ఎనుబది యేళ్ల విజర్డే
#
తరువే యొసగును జీవము
తరువే యగులే కడపటి తల్పము కూడా
తరువే యిచ్చును సకలము
తరువే లేనీ జగమును తలపగ లేమే
#
5.కం॥వెదురును వేణువు జేసిన
అధరము కోరిన మధువుల యదువే గావన్
విదురుని బ్రోచిన వెన్నుడు
వదలడు వేడిన నిజముగ వరదుడె మురళీ!
#
అక్షర సంపద కలిగిన
అక్షయ విద్యల జ్ఞానమును యమరదె మనకున్
అక్షర శిల్పులు మలచిన
అక్షర కన్యల సొబగును యశమున గనరే!
#
చిక్కని వెన్నుడు తల్లికి
చిక్కిన రీతినె పరులకు చిక్కగ లేడా
చక్కని కందము లల్లితి
మక్కువ మీరగ యలసిన మదినే జేరన్
#
కన్నపు వేణువు వదలని
కన్నా! తొమ్మిది కలుగుల కాయము గనవే
వెన్నుడ నీవని వేడగ
చిన్నెలు జూపగ నటనలు చేయగ తగునే!
#
గురుసుతు నాయువు తీరగ
గురు తెరుగని చోటుకేగి గురి తప్పించీ
గురువే మోదము నొందగ
గురు దక్షిణ నిచ్చినట్టి గురువే మురళీ
వారే కవివర కథకులు వాసిని జూడన్
వారే సారధి మాకును
వారే! ఏమని పొగడుదు వాక్కులు లేవే!
#
ముసలము ముదిమే గద
మసలుట యాతన గాదే మరిమరి జూడన్
మసకగ మారిన జూపులు
ముసిముసి వెదుకగ జూడవె మరలిన వయసే
#
చపలురు,చోరులు,జారులు
నిరతము దిరిగెడు ధరణిని నిన్నే వదలక
మరువక తలచెడి సుజనుల
మరిమరి జూడగ నభమును వీడి నావే!
#
మేలిమి రూపము గూడను
కాలము లోబడి కురూపి కాదే తెలియన్
మేలుగ జేసిన పుణ్యమె
కాలము దాటియు నిలుచును కనరే నిజమున్
#
కాయము గోరగ వేషము
వేయుట జనులకు సహజము వేషము దీయన్
స్వీయజనములే నగుదురు
దాయకుడై యుండవలెను దయతో నెపుడున్
#
తరువే యొసగును జీవము
తరువే యగులే కడపటి తల్పము కూడా
తరువే యిచ్చును సకలము
తరువే లేనీ జగమును తలపగ లేమే
#
చూడర తమిళుల గోలలు
వాడర నీటిని పొదుపుగ వరమే యనగా
కాడుగ మారదె జగమే
వేడగ గ్రుక్కెడు జలములు వేలమె యగునో
#
గురువే దీర్చును కోరిక
గురువే ,దైవమ్ము బ్రహ్మ గురుతర మూర్తే
గురువే చూపును మార్గము గురువే మోక్షము నిడగల గుప్తజ్ఞానే
#
చీకటి మూసిన యడవిన
కూకటి వేరుల యవిద్య కూరిమి మీరన్
వాకిట నిలచిన చాలును
నాకమె నేరుగ దొరకును నమ్మగ గురువున్
#
ఎల్లలు లేవే వీరికి
ఉల్లము ఝల్లను సవాలు కోరే వీరే
పల్లక పొత్తపు సారము
ఎల్లను నుడివెడు ఎనుబది యేళ్ల విజర్డే
#
తరువే యొసగును జీవము
తరువే యగులే కడపటి తల్పము కూడా
తరువే యిచ్చును సకలము
తరువే లేనీ జగమును తలపగ లేమే
#
5.కం॥వెదురును వేణువు జేసిన
అధరము కోరిన మధువుల యదువే గావన్
విదురుని బ్రోచిన వెన్నుడు
వదలడు వేడిన నిజముగ వరదుడె మురళీ!
#
అక్షర సంపద కలిగిన
అక్షయ విద్యల జ్ఞానమును యమరదె మనకున్
అక్షర శిల్పులు మలచిన
అక్షర కన్యల సొబగును యశమున గనరే!
#
చిక్కని వెన్నుడు తల్లికి
చిక్కిన రీతినె పరులకు చిక్కగ లేడా
చక్కని కందము లల్లితి
మక్కువ మీరగ యలసిన మదినే జేరన్
#
కన్నపు వేణువు వదలని
కన్నా! తొమ్మిది కలుగుల కాయము గనవే
వెన్నుడ నీవని వేడగ
చిన్నెలు జూపగ నటనలు చేయగ తగునే!
#
గురుసుతు నాయువు తీరగ
గురు తెరుగని చోటుకేగి గురి తప్పించీ
గురువే మోదము నొందగ
గురు దక్షిణ నిచ్చినట్టి గురువే మురళీ
Comments
Post a Comment