రాకన్ మానవు...

"రాకన్ మానవు హాని వృద్ధులు మహారణ్యంబులన్ దాగినన్"

పద్యం లోగొంతుకలో పాడు
కుంటున్న వాణ్ణల్లా , వంటింటి లోమా నాగ సుందరి వాక్ప్రవాహానికి ఆగిపోయాను.
" మా అమ్మ రావటం ఇష్టం లేకపోతే రావొద్దని చెప్పొచ్చుగా..అంతలా అడవుల్లో దాగాల్సిన అవసరమేమొచ్చింది..
అంతే లెండి..మా వాళ్లంటేనే మీకు గిట్టదు.
మొన్న మా మూడో అన్నయ్య భిలాయి నుంచి వస్తునాడని తెలిసి..."

"అహో."
.నాలిక్కరుచుకుని.. వీలైనంత వినయంగా-
"అదికాదు నాగూ..మా ఆఫీసులో ఆగస్ట్ పదిహేను కి నాటకం లో నేను పాడాల్సిన పద్యం ప్రాక్టీసు చేస్తున్నానంతే..."

అని సంజాయిషీ చెప్పుకుని చల్లగా సంచీ పుచ్చుకు బజార్ వేపు నడిచాను కూరలు తదితర సామగ్రి కోసం.
భగవంతుడా!

Comments