అనుభవం
@@@@@
చలపతి బండిలో అడుగు పెట్టి,చుట్టూ , జనం కబుర్లలో పడ్డారు.
ఒకాయనెవరో ప్రయాణాల్లో దొంగల గురించి సాధికారికంగా ఉపన్యసిస్తున్నాడు.ఆయన పోలీసు శాఖలో పనిచేస్తున్నాట్ట.
ప్రయాణాల్లో తీసుకోవలసిన జాగ్రత్తలు వివరంగా చెప్తున్నాడు.
ఆడవాళ్లు ప్రయాణాల్లో నగలపిచ్చి తో నగలన్నీ ప్రదర్శించకూడదన్నాడు.
రాత్రుళ్లు గుర్రు పెట్టి నిద్రపోకుండా మాటిమాటికీ సామాన్లు చెక్ చేసుకోవాలన్నాడు.
ఇంకా చాలామంది వాళ్ళ వాళ్ళ అనుభవాలు చెప్పడం మొదలుపెట్టేరు.
రాత్రి ఎనిమిది కాగానే అందరూ టిఫిన్లు కానిచ్చారు.
కడుపులో పడగానే రైలు కుదుపులకి అందరూ కునికిపాట్లు పడసాగేరు.
పోలీసు వెంకటసావి కూడ సన్నగా గురక పెట్టడం మొదలు పెట్టాడు.
మిగిలిన వాళ్లు కూడా ఇరుకు లోనే పక్క వాళ్ల మీద చేరబడి జోగడం ప్రారంభించారు.
ఎంతసేపయిందో తెలియదు.
హటాత్తుగా మెలకువ వచ్చిన పోలీసు అరుపులకు అందరూ తుళ్లిపడి లేచారు.
"ఏమయ్యిందంటూ"
నా బేగ్ కనపడటం లేదు.
అందులో నగలున్నాయి."
అందరు వాళ్లవాళ్ల సామాన్లు వెతుక్కోవడం మొదలు పెట్టారు.
ఒకరి పర్సు,మరొకరి సూట్కేసు కూడా పోయాయని మాటలు బట్టి తెలిసింది.
అదే సమయంలో ముందు స్టేషన్లో దిగిన చలపతి బరువైన సూట్కేసు మోసుకుంటూ,బేగ్ భుజానికి తగిలించుకుని,జేబులో పర్సు మందం బట్టి ఎంత డబ్బు వుందో ఊహిస్తూ,ముందుకు తాపిగా నడవసాగేడు.
అదేరోజు రాజమండ్రి జెయిల్ నుండి విడుదలైన వెంటనే మంచి బేరం తగిలినందుకు అతనికి చాలా సంతోషంగా వుంది.
Comments
Post a Comment