కందపద్యం చిన్నగా ఉన్నా, దాని నడక, హొయలు, చెప్పనలవి కాదు! ఎంతో భావాన్ని తనలో ఇమిడ్చేసుకుంటుంది. మకరందాలు ఒలకబోస్తుంది.
భాగవతుల కృష్ణారావు గారు కందపద్య ప్రేమికులు అని అందరికీ తెలిసిందే కదా! అయితే వారి "భావుకథలు" కూడా కందాల్లా అందంగా చిన్నగా ఉండి వాటిలో పెద్దపెద్ద భావాలు నింపేసుకున్నాయి, నర్మ గర్భాంగా!
భూతదయ గురించి, ఏది ఎవరికి రాసిపెట్టుందో వారికే దక్కుతుందనే వేదాంతం, మనం కంటితో చూసినవి, చెవులారా విన్నవి కూడా ఒక్కోసారి నిజం కాకపోవచ్చు అనే నిజం, ఒక మనిషి గురించి పూర్తిగా తెలియకుండా ఒక అభిప్రాయానికి రాకూడదనే నీతి, చిన్న కథల ద్వారా, ఎంతో చక్కగా తెలియజేసారు!
అలాగని కథలు ఎదో సూక్తి ముక్తావళి లాగా ఉంటాయనుకుంటే పొరపాటే! చివరిలో ఊహించని మలుపు తిరిగి, ప్రతీ కథ మనసులో ముద్ర పడిపోతుంది.
కృష్ణారావు గారూ, విందుభోజనంలో మధ్యమధ్యలో కొరుక్కుతినే చల్ల పచ్చి మిరపకాయల్లాగా, ఉప్మాలో జీడిపప్పులాగా చక్కని చిట్టి కథలు అందించినందుకు భావుక కుటుంబం తరఫున మీకు ధన్యవాదాలు!
Comments
Post a Comment