దర్పణం

దర్పణం
@@@@

18 వ శతాబ్దపు ఐరిష్ కవి ఎడ్మండ్ బర్క్ నడివయసు పై రాసిన కవితకు స్వేచ్ఛానువాదం..

ముకురంలో మొహం చూసాను..
ఇదేమిటి..ఎవరిది..
ఎవరీ అపరిచితుడు?
నేను కాదే!
నా ప్రతిబింబం..తేడా గా వుందే..
అంత లావెప్పుడయ్యాను..

నా పాత దర్పణం ఎక్కడుంది..
ముప్పయ్యేళ్ల కిందట చూసుకున్నప్పటి..
ముగ్ధమొహన రూపమేదీ!

ఇదేదో అబద్దాల అద్దం..
కాదంటారా?
పూర్వపు కర్పరాలు ఎక్కడ దొరుకుతాయి..
అన్నీ కృత్రిమ అద్దాలే..
నకిలీ ప్రతిబింబాలే..
కనుక-
గాబరా పడకండి.
మీ రంగూ,రూపము,ముడతలు అన్నీ కృత్రిమ మే..
నిజంకాదు..
అద్దం అబద్ధం చెప్తోంది..వికృతమైన అసత్యం..
దాన్ని సరి చెయ్యాలి.
కాదంటారా!

Comments