మహోన్నత మానవత్వం
*********"""""********
నిన్న టీవీలో అను కోకుండా క్రైం పెట్రోల్ ఎపిసోడ్ చూసేను.
నాకు మొదటి నుంచి డిటెక్టివ్ కథలు పిచ్చి ఉంది.ఇప్పటికీ కొమ్మూరి నవల కనపడితే తెలిసినా మళ్లీ చదువుతాను.
అలాగే వ్యోమ్కేశ్ బక్షీ ఎపిసోడ్ లు చూస్తాను.
నిన్నటి ఎపిసోడ్ లో నేరం,పరిశోధన లేదు.
అయినా ఆద్యంతము కూర్చుని చూసాను.
చాలాగొప్ప మానవతావాది కథ అది.
కొన్ని సీన్లు చూస్తున్నప్పుడు కళ్లంట నీళ్లు అప్రయత్నంగా తిరిగాయి.
కేరళ రాష్ట్రంలోని ఒక పల్లెటూరి పేదముస్లిం యువకుడు ఆరబ్ దేశం లో వెల్డర్ గా పనిచేస్తుంటాడు.
అకస్మాత్తుగా అతడి దృష్టి మందగిస్తుంది.
డాక్టర్ దగ్గరకు వెడితే పరీక్ష చేసి, కిడ్నీలు రెండూ పాడయ్యాయని చెప్తాడు.
అతడు తిరిగి స్వగ్రామం చేరుకుని కుటుంబ సభ్యులతో సంగతి చెప్పి కొచ్చిలో చికిత్స తీసుకుంటాడు.వారానికి రెండుసార్లు డయాల్సిస్ చేసుకోవాల్సి వస్తుంది.
ఖర్చు, వ్యాధి మనిషిని క్రుంగదీస్తాయి.
అతడి పెళ్లి కాని పినతల్లి టీచర్ గా పనిచేస్తూ అతడి డబ్బవసరాలు తీరుస్తుంది.
ఒకరోజు డయాలిసిస్ కోసం బస్సు లో వెడుతున్న ఇతడికి
ఫాదర్ సెబాస్టియన్ పక్కసీట్లో పరిచయమవుతాడు.
నిరాశగా,నీరసంగా కనపడుతున్న యువకుడి ని గమనించి సంగతేమిటని ఆదరంగా అడుగుతాడు.
అంతవరకు ఉగ్గబట్టుకున్న బాధనంతా ఏకరువు పెడతాడా యువకుడు.
కిడ్నీ ఇస్తానని డబ్బులు తీసుకుని మోసం చేసిన బ్రోకర్ గురించి కూడా చెప్తాడు.
అతడు చెప్పిదంతా శ్రద్ధగా వింటాడు ఫాదర్.
అంతా విన్నాక -
"నేను నీకు కిడ్నీ ఇస్తాను రేపు ఇద్దరం డాక్టర్ దగ్గరకు వెళ్దాం"
అంటాడు.
యువకుడు ఆశ్చర్యం గా నమ్మలేనట్లు చూస్తాడు.
ఫాదర్ అతని నెంబర్ తీసుకుని,తన స్టాప్ లో దిగి వెళిపోతాడు.
యువకుడికి నమ్మకం కుదరకపోయినా తల్లిదండ్రులతో జరిగిందంతా చెప్తాడు.
మర్నాడు అతడికి ఫాదర్ దగ్గర్నుంచి ఫోన్ వస్తుంది ఫలాన ఆసుపత్రి కి రమ్మని.
వెళతాడు..అక్కడ ఫాదర్ తో కలసి కావలసిన టెస్ట్ లు చేయించుకుంటాడు.
నిర్ణీత తేదీకి కిడ్నీ మార్పిడి కూడా జరుగుతుంది.
యువకుడు,అతని పరివారం ఫాదర్ ఉదారస్వభావానికి చేతులు జోడించి కృతజ్ఞతలు తెలియజేస్తారు.
ఫాదర్ ఒకే మాట చెప్తాడు.
"ప్రకృతి లేదా దైవం మనకి అవసరమైనదానికన్నా ఎక్కువ ఇస్తే అది అవసరమైన వారికి దానం చెయ్యడం కన్నా పుణ్యకార్యం మరేముంది.
నీకవసరమైన ఒక కిడ్నీ
నాదగ్గర అధికంగా ఉంది.అందుకే మరో అలోచన లేకుండా నీకిచ్చాను" అంటాడు.
మానవత్వానికి మేరుశిఖరం లా కనపడతాడు ఆ కేరళా ఫాదర్.
ఇది 2013 లో నిజంగా కేరళ లో జరిగింది.
Comments
Post a Comment