గ్రాంధికం

పూర్వం అంటే గిడుగు వారు పిడుగై గర్జించేదాక గ్రాంధికమే సర్వత్రా రాజ్యం చేసేది.
ఇప్పటికీ పెళ్లి శుభలేఖలు వాడుక భాషలో కాకుండా గ్రాంధికం లోనే కనపడుతుంది .
పూర్వ రచనలన్నీ గ్రాంధికమే!
పానుగంటి,మునిమాణిక్యం హాస్యరచనలు
గ్రాంధికమైనా కడుపుబ్బ నవ్వించేవి.
జంఘాలశాస్త్రి ఉపన్యాసాలు వ్యంగోక్తులతో అలరించేవి.
రాన్రాను వాడుక భాష లో రచనల జోరు ఎక్కువైంది.
అన్యదేశీయ పదాలు కలగలసిపోయి రచనల్లో విరివిగా వాడటం సామాన్యమైంది.
ఇప్పుడు గ్రాంధిక రచన చదవడానికే నోరు తిరగదు.
ఆ పదాల అర్ధాన్ని చూడటానికి నిఘంటువు కావాలి.
జంఘాల శాస్త్రి ఒకచోట మీసాల,గడ్డాలు వారిని వర్ణిస్తూ-
వృశ్ఛికపుచ్ఛచ్ఛ విచ్ఛేద శ్మశ్రులతారశ్ములవాడో,
ఖండకరకార్పాసకూర్పాసములవాడో
కమఠపృష్ట సరీసృప....
బులుసు వారి గ్రాంధిక పోస్ట్ చూసాక వచ్చిన జ్ఞాపకం!

Comments