తస్కరాయచ

తస్కరాయచ
************

"యా దేవీ సర్వ భూతేషు..."
రింగ్ టోన్ వినబడగానే సెల్ అందుకున్నాను.

బీరేన్భద్ర చండీపాట్ నాకిష్టం.

మహాలయా రోజు బెంగాల్లో జంక్షన్ లలో మైకుల్లో వినిపిస్తారు.
పూజా సందడి అప్పట్నుంచీ మొదలన్నమాట.
వింటుంటే భక్తిభావం కలుగుతుంది. దుర్గాదేవి ప్రత్యక్షమవుతుందా అన్నంత ఉద్వేగ పూరితంగా పాడేరాయన.
మంద్రంగా మొదలై తారస్థాయికి చేరతాడు.
దేవీ నామాల ఉచ్ఛారణ స్పష్టంగా ఉంటుంది.
అందుకే అదే నా రింగ్టోన్ గా పెట్టుకున్నాను.
డిస్ ప్లే లో నెంబర్....
కాల్ చేసిన నెంబర్ లిస్ట్ లో లేదు.
అన్నోన్ కాలర్. 
ఏ చండీగఢ్ స్పామ్ కాలరో!
సైబర్ క్రైమ్ టీం.

కట్ చేసాను.
మళ్లీ రింగొచ్చింది.
అదే నెంబర్.
ఏం చెయ్యడం! వాట్టుడూ! క్యాకరూం!
ధైర్యే సాహసే లక్ష్మీ అని ఫోన్ ఎత్తి-
అవతలి గొంతు వినకుండా-
"ఏసిపి సైబర్ క్రైమ్ కృష్ణారావు స్పీకింగ్" అన్నాను .పోలీస్‌ అంటే టక్కున కట్ చేస్తాడన్న ఆశతో.

"ఓర్నీభయం దొంగల్దోలా..నేనయ్యా బామ్మర్దీ! నా ఫోన్లో ఛార్జ్ లేకపోతే అల్లుడి ఫోన్ తో చేసాను...రాఖీ ప్రొగ్రామ్...." ఏదో అంటున్నాడు అటునుండి మా శ్యాలకుడు.

Comments