రమ్య సుగుణ సాంద్ర..

ఎంత తీపి లేదా కమ్మని పదార్థ మైనా ఒక పరిమితి దాటే సరికి వెగటనిపించడం సహజం.
అందుకే 'అతి సర్వత్ర వర్జయేత్' అన్నారు పెద్దలు.
అయితే ప్రతి నియమానికీ మినహాయింపు లున్నట్టే, కొన్ని నిరంతర సాధనలో కూడా ఆనందాన్నిచ్చేవి ఉన్నాయి.
అందులో మొదటిది సంగీతం
రెండోది సాహిత్యం.
పుస్తక పఠనం ఎన్నటికీ విసుగనిపించదు.జీవితాంతం అలా చదవాలనే అనిపిస్తుంది.
అలాగే కొన్ని కథావస్తువు లు ఎన్నిమార్లు ఎందరు వ్రాసినా మనకి నిత్యనూతనంగా ఉంటాయి.
అలనాడు వాల్మీకి వ్రాసిన రామాయణం ఈనాడు ఎంతమందో ఎన్ని భాషల్లో ఎన్ని రకాలుగా వ్రాసినా మనం అదే భక్తిభావంతో చదువుతూ ఆత్మానందం పొందాము.
ఇటీవల మిత్రులు గంగరాజు గారు- 'రమ్య సుగుణ సాంధ్ర రామచంద్రా'
 అనే మకుటంతో అలతి పదాలతో  అద్బుతమైన రామాయణ సన్నివేశాలతో
నూటెనిమిది ఆటవెలదుల నిందాస్తుతి శతకం వెలువరించారు.
లోగడ రామభూవరా శతకాన్ని వ్రాసినప్పటికీ  తమకం తీరక రామనామరస పిపాస నివృత్తి కి నిందాస్తుతి తో 
శ్రీ రాముని శ్లాఘించారు.

తాను దేవుడినని ఎనాడూ చెప్పని శ్రీరాముని లో మానవ దౌర్బల్యాలను ఎత్తిపొడుస్తున్నట్లే కనిపిస్తున్నా అంతరార్ధం లో పొగడ్తని గమనించగలం.
అలతి పదాలలో అద్భుతమైన రామచరితను నిక్షిప్తం చేసి మనకు అందించిన శ్రీ గంగరాజు గారికి ధన్యవాదాలు తెలుపుతూ 
శతకావలోకనం చేస్తూ రామకథా రసపానాన్ని చెయ్యండి.
'పిబరే రామరసం'

Comments