నిశిఉష్ణోదకము
*************
అదేదో సినిమాలో కోట అతిథులతో గ్రాంథికంలో
"తమరేమైనా నిశిఉష్ణోదకము సేవింతురా?"అంటాడు.
అతడి కొడుకు కూడా అతిథులతోపాటు జుట్టుపీక్కుంటూ-
" నాన్నా! మానవభాషలో మాట్లాడు " అంటాడు.
కాఫీ..
అందరికీ ఇష్టమైన ద్వక్షరీ మంత్రం.
తెల్లారి లేవగానే ఇది పడకపోతే రోజు మొదలవదు..
రోజుకు పదికప్పులుదాకా తాగిన వాళ్లు..
తిండికన్నా కాఫీకి ప్రాధాన్యత నిచ్చేవాళ్లు కోకొల్లలు..
ముఖ్యంగా దక్షిణాది వారికి యిది ప్రాణప్రదం..
కాఫీ దండకాలు,శతకాలు కూడా వచ్చేసాయి.
ఉత్తరదేశస్తులు టీ తో సరిపెట్టుకుంటారేమొ గానీ మన వారు కాఫీగతప్రాణులు.
అయితే ప్రపంచంలో అత్యంత ఖరీదైన కాఫీ యేదో తెలుసా?
సివెట్ కాఫీ...ఖరీదు
వేలపౌండ్లు..డాలర్లలో ఉంటుంది.
లూవర్క్ కాఫీ అని కూడా అంటారు.
దీని తయారీ తెలిస్తే ,మరి జన్మలో యీ కాఫీ తాగాలనిపించదు..
ఖరీదుకోసం కాదు.
సివెట్ అనే జాతి పిల్లుల(పునుగు పిల్లుల) 'మలం 'శుద్ది చేసి ,దీనిని తయారు చేస్తారు.
అవి ఎక్కువగా లేత కాఫీ గింజలను తింటాయిట.
అవి భోజనానంతరం వాటినలాగే విసర్జిస్తాయి.తర్వాత వాటిని శుద్ధి చేసి డాలర్ల లో అమ్ముకుంటారు.
అయ్యా/అమ్మా ! అదీ సంగతి.
పాతదే..మరోసారి.. కాఫీ ప్రియుల కోసం కాపీ పేస్టించాను.
Comments
Post a Comment