"బాగా చదువుకో"
"అలాగే "
"చెడు స్నేహాలు చెయ్యకు"
"చెయ్యను"
"బుద్ధిగా ఉండు"
*ఉంటాను"
విజయనగరం లో చదువుకి పెడుతూ నాన్న చెప్పిన మాటలు.
చదివాను డిటెక్టివ్ నవలలు.కథలు
చెడు స్నేహాలు చెయ్యలేదుకానీ చెడ్డవారితో కూడా తిరిగాను.
నూనూగు మిసాల నూత్నయవ్వన దశ..ప్రలోభాలు...ఆకర్షణలు..కవి చౌడప్ప లు తప్ప పెద్దనాదులను కానలేని వయసు.
సందులంట తిరగ లేదు గానీ రాజమార్గాల గుండా కూడా నడవలేదు.
బుద్ధిగానే ఉన్నాను గానీ డిగ్రీ ఎలాగో అయిందనిపించాను.
టైపు,షార్ట్ హేండ్ నేర్చుకోమంటే నేర్చుకున్నాను గానీ ప్రావీణ్యత సంపాదించలేకపోయాను.
ఫలితం రైల్వే సర్వీసు కమీషన్ ...అదే ఆరార్బీ లో స్టెనో వ్రాతపరీక్షలో సెలెక్ట అయినా టైప్ టెస్ట్ లో విఫలమయ్యాను.
అప్పటికే నాలుగైదు కథలు అచ్చవడంతో హైద్రాబాద్ ఈనాడుకి ఎగేసుకుంటూ పరిగెత్తాను.
ఓ సంవత్సరం 'ఎలాగో'తంటాలు పడి మళ్లీ నాన్నదగ్గరికి వాళ్ల కోరిక మీద రైల్వే ఉద్యోగం లో చేరాను.
"లౌక్యం నేర్చుకో...కాకా పట్టు..."" సహోద్యోగుల సలహాలు.
అయినా చేతకాక ముక్కు సూటిగా పోవడంతో రావలసిన ప్రమోషన్లు పక్కదారి పట్టాయి.ఎలాగో
ముప్ఫయారేళ్ల యాంత్రిక జీవనం తర్వాత రిటైరయ్యాక మళ్లీ ప్రవృత్తి ప్రేరణ తో వ్రాయటం మొదలు పెట్టాను.
అల్లసాని వారు ఊరికే అనలేదు.
"రమణీప్రియ దూతిక తెచ్చియిచ్చు..."
Comments
Post a Comment