మెరుపు మెరిసింది

#కథనకుతూహలం
నూటపదహారు పదాలకథ

మెరుపు మెరిసింది
****************
వామన్రావు గంటయి ఆమెను అనుసరిస్తున్నాడు.
ఆమె చాలా అందంగా ఉంది.
బాపు బొమ్మలా...వపా కావ్యనాయికలా
బ్రహ్మ చాలా శ్రద్ధగా సమతూకంతో ఆమెని తయారు చేసినట్లు తెలుస్తోంది.
వామన్రావు బేంకులో పనిచేస్తున్నాడు.తల్లి తండ్రి పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తున్నా తనే నచ్చక తాత్సారం చేస్తున్నాడు.
ఇన్నాళ్లకి తన కలల రాణి దొరికింది.

ఎవరిని చూడకుండా గమ్యం తెలుసున్న దానిలా నడుస్తోంది.
ఇవాళ ఎలాగైనా ఆమె ఇంటి నీ,ఇంటి వారినీ కలియాలని వామన్రావు ప్రయత్నం.
ఏం చదువుకుందో? ఉద్యోగ ప్రయత్నం వద్దని చెప్పాలి. ఇంట్లో ఉండి అన్నీ చూసుకుంటే చాలు. పక్కనే చెరువుకట్ట మీద నడుస్తోంది.
వామన్రావు గుండెలు ఢమఢమ కొట్టు కుంటున్నాయి.
ఆమెలో సుమంగళి చిహ్నాలు కనపడలేదు. మెళ్లో సన్నటి గొలుసొక్కటీ మెరుస్తూ కనిపిస్తోంది.
తన ప్రపోజల్ అంగీకరిస్తుందా!
 వామన్రావు ఠక్కున అగాడు. ఎదురుగా ఆమె.
ఊహల్లో గమనించలేదు.
సంజె చీకట్లు చుట్టుముడుతున్నాయి.
తన ఊహా సుందరి తీక్షణంగా తన వేపు చూస్తూ అడుగుతోంది.
"అన్నా! మాది శిర్కాకోలం.
ఇజీనారం పైడితల్లమ్మ సంబరాలకొచ్చీ తప్పిపోన్ను.
మావోళ్లంతా బస్సు డిపో కాడికెలిపోయుంటరు.దారి సెప్తావా?"
****
ఇది నా స్వంతం.అముద్రితం.

Comments