గంగరాజు గారి శుభకామనలు

సీ:
మంచి మనసు వాడు మమత పంచెడి వాడు
     కీర్తి సాంద్రుడు మన కృష్ణ రావు!
చెలిమి యనిన తాను చెవి కోసు కొనునెప్డు
     చేత కావు తనకు చేటు పనులు
సాహితీ సభలకు చనుచుండు తరచుగ
     అంద మలర కంద మల్ల గలడు!
నీతి తప్పని వాడు నీమాలు తోడుగ
     సంఘమందు చెలఁగు సజ్జనుండు.

ఆ.వె:
భాగ్యనగరమందు భావింపగా నాకు
ఎల్ల వేళ లితడు యిష్ట సఖుడు!
భాగవతుల వంశ బహుమాన చరితుడా!
శాంతి సుఖము లలర చనెద వయ్య.

సన్మిత్రులు శ్రీ భాగవతుల కృష్ణా రావు గారికి జన్మదిన శుభాకాంక్షలతో.....

ఎమ్మెస్వీ.
13.2.2023.

Comments