ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ
********
బ్రహ్మానందం లా అరవడం కాదు గానీ ఉచితమన్న మాట వినపడగానే ఉచితానుచితాలు మరిచి పిన్నాపెద్దా ఎగబడుతున్న రోజులివి.
ఎవరేనా ఏదైనా ఉచితంగా ఎందుకిస్తాడు చెప్పండి.
ఊష్ణం కూడా అరువివ్వని రోజుల్లో.
అయినా మానవ సహజ లోభత్వం ఊరుకోదు.
శ్మశాన వైరాగ్యం లా నీతులు వింటూవుంటాం..చెప్తూ ఉంటాం..కానీ మన దగ్గరకొచ్చేసరికి హుష్కాకీ అంటూ విచక్షణ ఎక్కడికో పారిపోతుంది.
అందుకు ఉదాహరణే నేను చెప్ప బోయేది.
ఈమధ్య జరిగింది.
ఉచితం కాదు కానీ చవకలో వచ్చినవి కూడా కొనకూడదని అర్ధమయింది ఆ అనుభవంతో.
ప్రెస్టిజ్ పెద్దకుక్కర్ కొంచెము అల్లరి చేస్తోందని అమెజాన్ వాడిని గెలికి ఒక చిన్న కుక్కరు,దాంతో ప్రెషర్ పేన్ ఉచితం కేవలం 950 రూపాయలే అన్నాడని ఆర్డర్ చేసాను.
బటర్ప్లై కుక్కర్,ప్రెషర్పేన్ అఘమేఘాలమీద వచ్చీసేయి లలలా అని కూతవేసుకుంటూ.
మూత మాత్రం రెండింటికీ ఒకటే.
'సరే 'పేన్ అటక ఎక్కించి, బుజ్జికుక్కర్లో కందిపప్పు పడేసిందావిడ.
శ్రవణానందకరంగా ఆరో ఏడో కూతలూ విన్నాక
దించేసాం.
మర్నాడు మళ్లీ అలాగే పెట్టేసరికి మూడో కూతకి సేఫ్టీవాల్వ్ ఎగిరి పప్పు పిచికారీ...
గోడలు..గిన్నెలు పప్పు మరకలు..
దగ్గర్లో ఎవరూ లేకపోవడంతో చాకిరీ తప్ప గాయాలపాలవలేదు.
చచ్చినట్డు మళ్లీ సేఫ్టి వాల్వ్ వేయించి మళ్లీ
పెట్టేసరికి ఈసారి కిందనుండి తన్నింది.
కొన్నదేదో స్టాండర్డ్ ప్రెస్టీజ్ ఒక వెయ్య ఎక్కువైనా కొనవచ్చు కదా!
సిమ్లో పెట్టినా అదే తంతు.
"అతి లోభికి ఖర్చు లావు" అంటారిందుకే.
Comments
Post a Comment