Skip to main content
అంతరం********"ఏవిటమ్మా నీ చాదస్తం...ఆ స్వగ్గీ,జొమాటో డిస్పోజబుల్ గిన్నెలు,చెంచాలు డస్ట్బిన్లో పడేయకుండా తీరిగ్గా కూచుని తోముతున్నావు?"కూతురి మాటలకు నవ్వుకుంటూ,తను చేస్తున్న పని ఆపకుండా వాటిని శుభ్రం చేసి బోర్లించింది కమల.తనకిది అలవాటే.కూతురు అలా అనడం ఆమె అలవాటు.రాత్రి డిన్నరయ్యాక మిగిలిన అన్నం,కూరలు,పచ్చళ్లు నీటుగా ఆ డబ్బాల్లో సర్ది భర్త చేతికి అందించి అపార్ట్మెంట్ వాచ్మెన్ కి అందజేయమని చెప్పింది.పూర్వం స్టీల్ గిన్నెల్లో ఇస్తే కొన్ని సార్లు తిరిగి వచ్చేవి.కొన్ని ఉండిపోయేవి.పనుల్లోపడి మర్చిపోయి మళ్లీ ఆ గిన్నె కావలసినప్పుడు గుర్తు వచ్చినా ఆశ వదులుకునేది.ఇప్పుడు స్విగ్గీలవీ వచ్చాక వాళ్లిచ్చిన కంటెయినర్లనే ఇలా ఉపయోగించి అమ్మయ్య అనుకుంది.అవి తిరిగి రాకపోయినా బాధలేదు.ఈ కాలం పిల్లలకేం తెలుస్తుంది.బేరాల ఆడరు.మనం చెప్పినది వినరు.కష్టమైనానష్టమైనా వాళ్లకి తోచినదే చేస్తారు.మొన్న ఏదో ప్రహేళిక గురించో కథ కోసమో ఆలోచిస్తుండగా ఇంటరు చదువుతున్న మనవరాలు ఫోనుమాటలు గదిలోంచి వినపడ్డాయి.అ సంభాషణలో కొన్ని పదాలు నాకు వింతగా అనిపించాయి.అర్ధం కూడా కాలేదు.గెంజ్,డ్రిప్,వైబింగ్,ఫోమో,మిల్లెనియల్స్...పై పదాలు గుణాఢ్యుడి పైశాచిక భాషలా అనిపించింది. పజిల్ కన్నా ముందు దీని అంతు తేల్చుకుందామని లేచింది.సరే...తను హాల్లోకి రాగానే అడుగుదామని నిరీక్షించాకఅనుకున్నట్టే కాస్సేపటికి హాల్లోకి రాగానే నా సంశయాత్మక పదాల వివరణ అడిగితే-ఆమె నవ్వుతూ ఇలా వివరణ ఇచ్చింది.గెంజ్..రెండువేల సంవత్సరం తరవాత పుట్టిన జనరేషన్ గెంజ్ అనబడతారట.మిలెనియల్స్..రెండువేల ముందు అంటే మన జనరేషన్ మిలెనియల్స్ అనబడతారట.డ్రిప్ అంటే యువర అవుట్ఫిట్ లుక్స్ గుడ్ అని అర్ధమట.వైబింగ్..ఇఫ్ యూ ఫీల్ గుడ్ టు ఎనీ ప్రొగ్రాం...సంగ్,డేన్స్...ఫోమో..ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్.ఇదంతా తెలుగు,ఇంగ్లీషు కలగలిపి చెప్పింది.ఇప్పుడు అంతా షార్ట్హేండ్ బాషేనట.మున్ముందు మరీ నాగరీకం ముదిరి సౌజ్ఞలే చేసుకుని....దేవుడా రక్షించు దేశాన్ని...కాలంతో పోటీ పడే జెన్ జీలుతమకిష్టమైన వాటికోసం ఏమైనా చేసే మన్ మౌజీల నుండి.
Comments
Post a Comment